Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinee9eca4e-4626-4712-b85c-7ba348cf1ca1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinee9eca4e-4626-4712-b85c-7ba348cf1ca1-415x250-IndiaHerald.jpgటీమిండియాలో సీనియర్ స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతను టెస్ట్ క్రికెట్లో ఇక ఎప్పుడూ గుర్తుండిపోయేను అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్లలో అతను ఎప్పుడు మొదటి వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో అతన్ని తెలివైన స్పిన్నర్ అని కూడా క్రికెట్ పండితులు పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కించుకోవచ్చుashwin{#}anil music;Cricket;Sri Lanka;Indiaఅశ్విన్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. ఇంకో 5 వికెట్లు తీస్తే?అశ్విన్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. ఇంకో 5 వికెట్లు తీస్తే?ashwin{#}anil music;Cricket;Sri Lanka;IndiaFri, 01 Nov 2024 10:30:00 GMTటీమిండియాలో సీనియర్ స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతను టెస్ట్ క్రికెట్లో ఇక ఎప్పుడూ గుర్తుండిపోయేను అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్లలో అతను ఎప్పుడు మొదటి వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో అతన్ని తెలివైన స్పిన్నర్ అని కూడా క్రికెట్ పండితులు పిలుచుకుంటూ ఉంటారు.



 ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కించుకోవచ్చు అన్న విషయం అశ్విన్ కు బాగా తెలుసు. అందుకే స్పిన్నర్లను బాగా ఆడుతూ బౌండరీలు బాదే స్టార్ బ్యాట్స్మెన్లు సైతం అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు అంటే పరుగులు తీయడం కాదు ముందుగా వికెట్ కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతలా బ్యాట్స్మెన్ లను భయపెడుతూ ఉంటాడు అశ్విన్. కొన్ని కొన్ని సార్లు క్రికెట్ రూల్స్ ని తూచా తప్పకుండా పాటిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్న ఈ సీనియర్ స్పిన్నర్ ను ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది.



 ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కాగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓడిపోయినట్టు ఇండియా సిరీస్ ను చేజార్చుకుంది. కాగా ఇవాల్టి నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇక ఈ మూడో టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డుపై కన్నేసాడు. ఈ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్ తరపున అత్యధిక సార్లు ఐదు వికెట్లు కూల్చిన ప్లేయర్గా నిలుస్తాడు. ఓవరాల్ గా నాలుగో ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం అనిల్ కుంబ్లె, అశ్విన్ ఇద్దరు కూడా 37సార్లు ఐదు వికెట్లు సాధించి రికార్డును పంచుకున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ లిస్టులో శ్రీలంక దిగ్గజం మురళీధరన్ 77 సార్లు 5 వికెట్లు సాధించి టాప్ లో ఉన్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున కెరీర్‌ మార్చేసిన "అన్నమయ్య"...ఎవరికీ దక్కని పుణ్యమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>