DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ttd40254386-74b7-4fb4-9c6d-7045b644b861-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ttd40254386-74b7-4fb4-9c6d-7045b644b861-415x250-IndiaHerald.jpgబీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయకుల్లో కొందరి పరిస్థితి కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్రమించిన వారు ఉన్నారు. కీలకమైన బీజేపీ సిద్ధాంతాలను కూడా ప్రచారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో బీజేపీలోని కొందరు నాయకులు.. చాలా అంకిత భావంతో వ్యవహరించారు. నిరంతరం.. శ్రీవారి ఆలయం గురించే వారు ఆవేదన చెందారు. ఆలయంలో ఆచారాలు భ్రష్టు పడుతున్నాయని, సంప్రదాయాలకు విలువ లేకుండా పోతోందని.. పెద్ద ఎత్తున విమర్శలుttd{#}ankhita;bhanu;Tirupati;Doctor;TDP;Andhra Pradesh;News;Party;Bharatiya Janata Party;Ministerపాపం..! బీజేపీ వీర విధేయులకి దక్కని ప్రాధాన్యం..?పాపం..! బీజేపీ వీర విధేయులకి దక్కని ప్రాధాన్యం..?ttd{#}ankhita;bhanu;Tirupati;Doctor;TDP;Andhra Pradesh;News;Party;Bharatiya Janata Party;MinisterFri, 01 Nov 2024 11:28:00 GMTబీజేపీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది నాయకుల్లో కొందరి పరిస్థితి కక్కలేని, మింగలేని స్థితిలో ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. బీజేపీ కోసం ఎంతో శ్రమించిన వారు ఉన్నారు. కీలకమైన బీజేపీ సిద్ధాంతాలను కూడా ప్రచారంలో పెట్టిన వారు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో బీజేపీలోని కొందరు నాయకులు.. చాలా అంకిత భావంతో వ్యవహరించారు. నిరంతరం.. శ్రీవారి ఆలయం గురించే వారు ఆవేదన చెందారు.


ఆలయంలో ఆచారాలు భ్రష్టు పడుతున్నాయని, సంప్రదాయాలకు విలువ లేకుండా పోతోందని.. పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారు.. వాటి కోసం పోరాటాలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరిలో తిరుపతికే చెందిన భాను ప్రకాశ్ రెడ్డి, అదేవిధంగా అనంతపురానికి చెందిన బీజేపీ ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరి దృష్టి అంతా శ్రీవారి ఆలయ బోర్డుపైనే ఉంది.



“ఈసారి మనకు ఖాయం. అన్న మనల్ని కూర్చోబెడతాడు” అని భావించిన ఇలాంటి ముగ్గురు నలుగురు కీలక నాయకులు.. ఓ మంత్రిపై ఆశలు కూడా పెట్టుకున్నారు. అంతేకాదు.. మాజీ బీజేపీ చీఫ్ ద్వారా.. కేంద్రంలోని పెద్దలకు కూడా సమాచారం చేరవేశారు. టీడీపీ బోర్డులో సభ్యత్వం కోసం నానా ప్రయత్నా లు చేశారు. తాము తిరుమల పవిత్రత కోసం, తిరుమల కోసం ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పుకొన్నారు.


కానీ, ఫాపం.. ఈ బీజేపీ వీర విధేయుల ఆశలు ఫలించలేదు. బీజేపీ నుంచి ఎవరికీ దక్కలేదు. కానీ, ఇదే బీజేపీ కోటాలో గుజరాత్‌కు చెందిన కీలక వ్యక్తి డాక్టర్ అదిత్ దేశాయ్‌కు బోర్డులో సభ్యత్వం దక్కింది. ఇలా ఈ పదవి దక్కడం వెనుక.. కేంద్రంలోని బలమైన మంత్రి సిఫారసు ఉన్నట్టు సమాచారం. అందుకే.. బీజేపీకి ఏపీ కోటాలో ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం. ఇది .. ఇప్పటి వరకు వీరవిధేయులుగా ఉన్న వారిని నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>