DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdp7015010c-8344-4da8-bc05-36999545e6bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tdp7015010c-8344-4da8-bc05-36999545e6bd-415x250-IndiaHerald.jpgటీడీపీలో సీనియర్లకు ఇపుడు రిటైర్మెంట్ టైం నడుస్తోంది అని అంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లలో చాలా మందికి టికెట్లు దక్కలేదు. ఇక దక్కిన వారికి కూడా ఎమ్మెల్యేలుగానే ఉంచేశారు. మంత్రి పదవులలో వారిని పక్కన పెట్టారు. మరో వైపు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జూనియర్లు యంగ్ బ్లడ్ కే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దాని వల్ల రేపటి తెలుగుదేశం పార్టీ మరో నలభై ఏళ్ల పాటు మనగలగాలన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా కనిపిస్తోంది. అంతే కాదు టీడీపీ భవిష్యత్తు నేత నారా లోకేష్ ని యువతరంతో అనుసంధానం చేసేtdp{#}ashok;Telugu Desam Party;Nara Lokesh;Governor;Tirumala Tirupathi Devasthanam;TDP;MLA;central government;Minister;Partyటీడీపీ సీనియర్ నేతల్ని చంద్రబాబు పక్కకి తప్పిస్తున్నారా? లోకేశ్ ఫ్యూచర్ కోసమేనా..?టీడీపీ సీనియర్ నేతల్ని చంద్రబాబు పక్కకి తప్పిస్తున్నారా? లోకేశ్ ఫ్యూచర్ కోసమేనా..?tdp{#}ashok;Telugu Desam Party;Nara Lokesh;Governor;Tirumala Tirupathi Devasthanam;TDP;MLA;central government;Minister;PartyFri, 01 Nov 2024 15:26:00 GMTటీడీపీలో సీనియర్లకు ఇపుడు రిటైర్మెంట్ టైం నడుస్తోంది అని అంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్లలో చాలా మందికి టికెట్లు దక్కలేదు. ఇక దక్కిన వారికి కూడా ఎమ్మెల్యేలుగానే ఉంచేశారు. మంత్రి పదవులలో వారిని పక్కన పెట్టారు. మరో వైపు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా జూనియర్లు యంగ్ బ్లడ్ కే ప్రాధాన్యత కల్పిస్తున్నారు.


దాని వల్ల రేపటి తెలుగుదేశం పార్టీ మరో నలభై ఏళ్ల పాటు మనగలగాలన్నది పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా కనిపిస్తోంది. అంతే కాదు టీడీపీ భవిష్యత్తు నేత నారా లోకేష్ ని యువతరంతో అనుసంధానం చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. చంద్రబాబుకు ఆనాడు సన్నిహితులుగా ఉన్న వారు మెల్లగా ఇపుడు సైడ్ అవుతున్న పరిస్థితి ఉంది.  



టీటీడీ బోర్డు ఛైర్మన్‌ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు వినిపించింది.  ఆయనకు ఈసారి లోక్ సభ టికెట్ ఇవ్వలేదు. కానీ కొత్తవారిని యువతరాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో అలా చేశారు అని అంటున్నారు. ఇక అశోక్ కి ఘనమైన నామినేటెడ్ పదవి దక్కుతుందని అనుకున్నారు. అదే టీటీడీ చైర్మన్ పదవి అని కూడా అనుకున్నారు. కానీ ఆయనకూ ఈ చాన్స్ ఇవ్వలేదు.  


ఇక ఆయన పేరుని రాజ్యసభకు పరిశీలిస్తారని గవర్నర్ పదవి కి ఆయన పేరుని సిఫార్సు చేస్తారని అంటున్నారు. చూడాలి మరి. ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అయినా మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయినా ఎమ్మెల్యేలుగానే ఈ టెర్మ్ లో ఉంటారా అన్న చర్చ కూడా మొదలైంది. ఇంకో వైపు చాలా మంది సీనియర్లు తమ ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేశారు. వారు కూడా ఇపుడు సైలెంట్ అయ్యారు.


కేవలం ఉత్తరాంధ్రాలో కాదు ఏపీలో అంతటా సీనియర్లకు రెస్ట్ ఇస్తూ జూనియర్లను టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు. దాంతో సీనియర్లు తమ వారసులకు పదవులు ఇప్పించుకుని తాము సైడ్ అవాడమే ఉత్తమం అనుకుంటున్నారు. మరి వారసులలో ఎంతమందికి చాన్స్ దక్కుతుంది అన్నది కూడా ప్రశ్నార్ధకమే అని అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైయస్ విజయమ్మ హత్యకు భారీ కుట్ర.. జగన్ ప్లాన్ మాములుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>