EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagandc8686a2-ebd1-471a-821e-d5ee7a9f5b5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagandc8686a2-ebd1-471a-821e-d5ee7a9f5b5b-415x250-IndiaHerald.jpgపోలవరం ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అంతవరకు ఓకే కానీ మరోసారి పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేసే పనిలో పడింది వైసిపి. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో పోలవరం ప్రాజెక్టు ఒక అస్త్రంగా మారింది అప్పటి విపక్షాలకు. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమిjagan{#}Jagan;Amaravati;polavaram;Aqua;Polavaram Project;TDP;central government;YCP;CBN;Governmentచంద్రబాబుని డైవర్ట్ చేస్తున్న జగన్? ప్లాన్ సక్సెస్ అవుతుందా..?చంద్రబాబుని డైవర్ట్ చేస్తున్న జగన్? ప్లాన్ సక్సెస్ అవుతుందా..?jagan{#}Jagan;Amaravati;polavaram;Aqua;Polavaram Project;TDP;central government;YCP;CBN;GovernmentFri, 01 Nov 2024 11:10:00 GMTపోలవరం ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది.  కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది.  అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అంతవరకు ఓకే కానీ మరోసారి పోలవరం ప్రాజెక్టును రాజకీయం చేసే పనిలో పడింది వైసిపి.  


గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో పోలవరం ప్రాజెక్టు ఒక అస్త్రంగా మారింది అప్పటి విపక్షాలకు. ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది వైసీపీ.


ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీకి భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈ విషయంలో ఏం చేస్తున్నట్టు అని జగన్ ప్రశ్నిస్తున్నారు.  పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని.. అయినా చంద్రబాబు స్పందించడం లేదని వైసీపీ అధినేత తాజాగా ప్రశ్నించారు.  పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని ఆయన తాజాగా డిమాండ్ చేశారు


వాస్తవానికి పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లుగా డిజైన్ చేశారు.  దానిని 41.15 మీటర్లకు తగ్గించారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని.. 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ.. 115 టీఎంసీలకే పడిపోతుందని కొత్త వాదనలను తెరపైకి తెచ్చింది


2018లో తెచ్చిన డిమాండ్లను జగన్ తెరపైకి తేవడం విశేషం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని జగన్ చెప్పుకొచ్చేవారు. పదేపదే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సవాల్ చేసేవారు. ఈ తరుణంలో చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. అప్పటినుంచి చంద్రబాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మరోసారి అదే వ్యూహంతో జగన్ ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు వెనక్కి తగ్గుతారా? జగన్ ట్రాప్ లో పడతారా? అన్నది తెలియాల్సి ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి పల్లవి అన్ని సినిమాల్లో నటించిందా.. చిన్న వయసులోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>