EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanthb6f3f001-9d50-41c6-91ce-9762561cb46a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanthb6f3f001-9d50-41c6-91ce-9762561cb46a-415x250-IndiaHerald.jpgమరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్తోనే కేసీఆర్ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు "... ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి. ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. వచ్చింది కూడా. చాలా మంది వచ్చి ..కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చిట్ చాట్లలో చాలా సార్లు సీరియస్ కామెంట్స్ చేశారు. అన్నీ రాజకీయపరమైనవే. వాటిపై బీఆర్ఎస్ నేతrevanth{#}KCR;KTR;revanth;Revanth Reddy;politics;Reddy;Party;CMకేసీఆర్ ను ట్రాప్ లో పడేస్తున్న రేవంత్ రెడ్డి..?కేసీఆర్ ను ట్రాప్ లో పడేస్తున్న రేవంత్ రెడ్డి..?revanth{#}KCR;KTR;revanth;Revanth Reddy;politics;Reddy;Party;CMThu, 31 Oct 2024 11:00:00 GMTమరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్తోనే కేసీఆర్ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు "... ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి.   ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. వచ్చింది కూడా. చాలా మంది వచ్చి ..కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు.

 

సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చిట్ చాట్లలో చాలా సార్లు సీరియస్ కామెంట్స్ చేశారు. అన్నీ రాజకీయపరమైనవే. వాటిపై బీఆర్ఎస్ నేతలు ఆవేశపడుతూంటారు.  అందుకే హరీష్ రావు చాలా సార్లు రేవంత్ రెడ్డి చిట్ చాట్లలో చేస్తున్న వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.  తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ చిట్ చాట్లను తన రాజకీయ వ్యూహాల కోసం వినియోగించుకుంటారని అనుకోవచ్చు.  


కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. కేటీఆర్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు తోడు హరీష్ రావు ఉంటున్నారు. అయితే కేసీఆర్ బయటకు రావాలని రేవంత్ కోరుకుంటున్నారు. గతంలో అనేక సార్లు సవాళ్లు చేశారు. అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బయటకు రాలేదని చాలా సార్లు సీరియస్ కామెంట్లు చేశారు.  కేసీఆర్ బయటకు వచ్చి తనతో పోటీగా రాజకీయాలు చేయాలని రేవంత్ అనుకుంటున్నారు.  అందుకే ఎప్పటికప్పుడు కేసీఆర్ ను .. బీఆర్ఎస్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.



రేవంత్ మాటలపై బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు కానీ..కేసీఆర్ వైపు నుంచి స్పందన రావడం లేదు.  కనీసం పార్టీ కార్యక్రమాల గురించి పట్టించుకోవడం లేదు.  రాజకీయాలు అసలు మాట్లాడటం లేదు. కేటీఆర్, హరీష్ రావులకు అయినా దిశా నిర్దేశం చేస్తున్నారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రేవంత్ చిట్ చాట్లలో చేస్తున్న కామెంట్స్ పూర్తిగా కేసీఆర్ ను మళ్లీ బయటకు తీసుకు వచ్చే వ్యూహమే.  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెంకటేష్ - కమలహాసన్ కాంబోలో రావాల్సిన సూపర్ హిట్ సినిమా ఏంటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>