MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac72b79f8-8b20-4eb1-8fac-38eac92fabb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac72b79f8-8b20-4eb1-8fac-38eac92fabb5-415x250-IndiaHerald.jpg. అఖండ 2 పేరుతో ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెర్కక్కించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ అఘోర పాత్ర‌లో కనిపించడమే కాకుండా మరో ముఖ్యమైన పాత్రలో హైలెట్ కాబోతున్నారని తెలుస్తుంది . అదే విధంగా ఈసారి యూఎస్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. Balayya{#}boyapati srinu;pragya jaiswal;American Samoa;Bike;Yashasvi Jaiswal;Episode;Balakrishna;Blockbuster hit;Success;India;Darsakudu;Heroine;Director;Cinema;Newsబాలయ్యతో బోయపాటి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ఈసారి అరుపులే..!బాలయ్యతో బోయపాటి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ఈసారి అరుపులే..!Balayya{#}boyapati srinu;pragya jaiswal;American Samoa;Bike;Yashasvi Jaiswal;Episode;Balakrishna;Blockbuster hit;Success;India;Darsakudu;Heroine;Director;Cinema;NewsThu, 31 Oct 2024 15:41:00 GMTనట‌సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఆ సక్సెస్ కు సిక్వల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. అఖండ 2 పేరుతో ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెర్కక్కించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ అఘోర పాత్ర‌లో కనిపించడమే కాకుండా మరో ముఖ్యమైన పాత్రలో హైలెట్ కాబోతున్నారని తెలుస్తుంది . అదే విధంగా ఈసారి యూఎస్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.


అఖండ సినిమాలో బాలయ్య రైతుగా , అగోరగా రెండు పాత్రలో కనిపించాడు.. ఇప్పుడు వచ్చే రెండో భాగంలో ఆ పాత్రలకు కొనసాగింపుగా కొంచెం కొత్తగా సినిమాను చూపించబోతున్నాడట బోయపాటి .. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పాత్రను రక్షించేందుకు బాలయ్య అమెరికాలో ఓ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే స్టైలిష్ లుక్ లో బైక్ పై బాలయ్య ఎంట్రీ ఇస్తూ ఆ సీన్ లో ఫైట్లు కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భాగంలో రెండు పాత్రలో కనిపించిన బాలయ్య ఈసారి కొంచెం స్టైలిష్ గా కనిపించబోతున్నాడు.


అలాగే బాలయ్య రెండో పాత్ర ఇమేజ్ ఈసారి పూర్తిగా బోయపాటి మార్చ‌బోతున్నాడు.. స్టైలిష్ యంగ్ లుక్ లో బాల‌య్య‌ను పరిచయం చేయాలన్నది బోయపాటి ప్లాన్ గా కనిపిస్తుంది. అలాగేహై వోల్టేజ్ యాక్షన్ తో వస్తున్న ఈ సీన్లు ఇంటెన్సిటీ ప్రేక్షకులకు తెగ నచ్చుతుందట. అలాగే ఈ సీక్వెల్‌లో కూడా ప్రగ్యా జైస్వాల్ తన మొదటి పాత్రలోనే ఉంటుందని తెలుస్తుంది .. ఇకపోతే ఈసారి కథలో మరికొన్ని కొత్త ట్విస్టులు కూడా ఉంటాయని బోయపాటి ఇప్పటికే హింట్ ఇచ్చారు. అఖండ’ భారీ సక్సెస్ అయినందున, ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి కొత్త హైప్ తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్త అవతార్‌లో చూపిస్తూ, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లే విధంగా బోయపాటి శ్రీను ప్రణాళిక వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే, బాలయ్య పాన్ ఇండియా రేంజ్‌లో మరింతగా ప్రజాదరణ పొందుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు లావణ్య త్రిపాఠి ..ఇప్పుడు శోభితా ధూళిపాళ్ల.. పెళ్ళికి ముందే అత్తగారింట్లో అలాంటి పనులా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>