DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth79ba4e22-efb5-47b8-9735-4bb58138c805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth79ba4e22-efb5-47b8-9735-4bb58138c805-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక ప్రచారం పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. రెబల్స్ ను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ కు ఆ లిస్టులో స్థానం కల్పించింది. ఇక..ఇటు బీజేపీ సైతం తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. మహారాష్ట్ర ఎన్నికలను ఈ సారి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న వేళ ఇక్కడ ఫలితం కీలకం కానుందిrevanth{#}Haryana;revanth;Prime Minister;Maharashtra;Bank;Maha;Elections;Bharatiya Janata Party;Assembly;CM;November;Party;Telangana;Congressరేవంత్ రెడ్డి పై అతిగా ఆధారపడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం? ఇచ్చిన టాస్క్ లో సక్సెస్ అవుతారా..?రేవంత్ రెడ్డి పై అతిగా ఆధారపడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం? ఇచ్చిన టాస్క్ లో సక్సెస్ అవుతారా..?revanth{#}Haryana;revanth;Prime Minister;Maharashtra;Bank;Maha;Elections;Bharatiya Janata Party;Assembly;CM;November;Party;Telangana;CongressThu, 31 Oct 2024 17:36:00 GMTమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక ప్రచారం పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. రెబల్స్ ను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ కు ఆ లిస్టులో స్థానం కల్పించింది. ఇక..ఇటు బీజేపీ సైతం తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది.


మహారాష్ట్ర ఎన్నికలను ఈ సారి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న వేళ ఇక్కడ ఫలితం కీలకం కానుంది. కాంగ్రెస్ నుంచి 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించుతోంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ కు బాధ్యతలు కేటాయించింది. భౌగోళికంగా తెలంగాణతో మహా రాష్ట్రకు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్ర లోనూ హామీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే బిగ్ టాస్క్ ను కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు అప్పగించింది.


మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి తమ అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి.

బీజేపీ గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలో దాదాపు 50 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు.  



బీజేపీ పాలిత రాష్ట్రాల మఖ్యమంత్రులు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అమిత్‌షా 20 ర్యాలీలు, నితిన్ గడ్కరి 40 ర్యాలీలు నిర్వహించనుండగా, దేవేంద్ర ఫడ్నవిస్ 50 ర్యాలీల్లో పాల్గొనేలా నిర్ణయించారు. హర్యానా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి.  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉక్రెయిన్ లో అడుగు పెట్టిన కిమ్ సైన్యం..? ఇక ఊచకోతేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>