LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/arthritis--winter-expert--suggestions--preventionf5d4f599-f81f-4537-81d5-736534f897e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/arthritis--winter-expert--suggestions--preventionf5d4f599-f81f-4537-81d5-736534f897e8-415x250-IndiaHerald.jpgచలికాలం వచ్చినప్పుడు కీళ్ల నొప్పులు మరి ఎక్కువగా అనిపిస్తున్నాయా? చలికాలంలో ఏ నొప్పి అయినా కానీ మరి ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే చలికాలంలో మన బాడీ చాలా కూల్ గా అయిపోతుంది. అందుకని చిన్న నొప్పి అయినా కానీ పెద్ద నొప్పిగా అనిపిస్తుంది. సీజన్ బట్టి వాతావరణమే కాదు, మనుషుల ఆరోగ్యం విషయంలోనూ పలు మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా మిగతా కాలాలతో పోలిస్తే వింటర్ లో కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎవరిలోనైనా తలెత్తవచ్చు. చల్లటి వాతావరArthritis ; winter; expert ; suggestions ; prevention{#}Evening;oilచలికాలంలో కీళ్లనొప్పులా...? నివారణ కోసం నిపుణుల సూచనలు ఇవే!చలికాలంలో కీళ్లనొప్పులా...? నివారణ కోసం నిపుణుల సూచనలు ఇవే!Arthritis ; winter; expert ; suggestions ; prevention{#}Evening;oilWed, 30 Oct 2024 16:48:00 GMTచలికాలం వచ్చినప్పుడు కీళ్ల నొప్పులు మరి ఎక్కువగా అనిపిస్తున్నాయా? చలికాలంలో ఏ నొప్పి అయినా కానీ మరి ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే చలికాలంలో మన బాడీ చాలా కూల్ గా అయిపోతుంది. అందుకని చిన్న నొప్పి అయినా కానీ పెద్ద నొప్పిగా అనిపిస్తుంది. సీజన్ బట్టి వాతావరణమే కాదు, మనుషుల ఆరోగ్యం విషయంలోనూ పలు మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా మిగతా కాలాలతో పోలిస్తే వింటర్ లో కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎవరిలోనైనా తలెత్తవచ్చు. చల్లటి వాతావరణం, ఎండ తగలకపోవడం, శరీరంలో విటమిన్-డి లోపించడం, శారీరక శ్రమ తగ్గడం, నీరు తక్కువగా తాగటం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.

 అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని నివారణ పద్ధతులను సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. వాతావరణ మార్పు వల్ల ఉదయం, సాయంత్రం చలిగాలులు వీస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారిలో సమస్య మరింత అధికం అవుతుంది. రోజువారి పనులు చేసుకోవటం కూడా కష్టంగా మారుతుంది కొందరికి. అయితే చలికాలంలోనూ తరచుగా వ్యాయామాలు చేయడం ఎందుకు చక్కటి పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. వెదర్ కారణంగా అసౌకర్యంగా అనిపించినా వ్యాయామం తరువాత మంచి ఫలితాలను ఇస్తుంది.

రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. కాళ్లు, చేతుల్లో పాపు తగ్గుతుంది. చలి కారణంగా కీళ్ల నొప్పులు ఎదుర్కొనే వారు ఈ సీజన్లో గోరువెచ్చని నీటిని తాగటం మంచిదంటున్నారు ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు. అలాగే గోరు వెచ్చని నీటిలో ఆవాల నూనె చుక్కలు కలిపి పాదాలు, చేతులు ఆ నీటిలో కాసేపు ఉంచి తరువాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. దీంతో కీళ్ళ నొప్పులు నుంచి ఉపశ్రమణం కలుగుతుంది. ఒకవేళ మీకు వ్యాయామం చేయడానికి తగిన సమయం లేదనుకుంటే చలికాలంలో డైలీ స్ట్రెచింగ్ కూడా చేయవచ్చు. దీనివల్ల కాళ్లు, చేతులు, కీళ్ల భాగంలో కదలికల వల్ల నొప్పి నుంచి ఉపశ్రమణం పొందుతారు. అలాగే శరీరాన్ని చలి వాతావరణం నుంచి రక్షించుకోవాలి. వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లకు సాక్స్, చేతులకు క్లాతింగ్ గ్లోవ్స్ ధరించవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టోరీని అనవసరంగా గెలికాం.. లేదంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.. దిల్ రాజు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>