MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbk5f42295c-490e-4b25-8658-bfa99f7541fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nbk5f42295c-490e-4b25-8658-bfa99f7541fa-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరస పెట్టి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం బాలయ్య "అఖండ" అనే మూవీలో నటించగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే కొంత కాలం క్రితం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య కNbk{#}Kesari;lion;Simha;Box office;Balakrishna;News;Makar Sakranti;Cinema;October;DiwaliNBK 109 : డాకు మహారాజ్ లేనట్లే.. కొత్త టైటిల్పై కసరత్తు చేస్తున్న యూనిట్..?NBK 109 : డాకు మహారాజ్ లేనట్లే.. కొత్త టైటిల్పై కసరత్తు చేస్తున్న యూనిట్..?Nbk{#}Kesari;lion;Simha;Box office;Balakrishna;News;Makar Sakranti;Cinema;October;DiwaliWed, 30 Oct 2024 13:17:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య ఈ మధ్య కాలంలో వరస పెట్టి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం బాలయ్య "అఖండ" అనే మూవీలో నటించగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే కొంత కాలం క్రితం భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య కు ఈ మూవీ ద్వారా కూడా మంచి విజయం దక్కింది.

ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 109 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను మాత్రం మూవీ బృందం వారు ప్రకటించలేదు. ఇకపోతే రేపు అనగా అక్టోబర్ 31 వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం నుండి ఈ మూవీ కి ఆ టైటిల్ అనుకుంటున్నారు ..? ఈ టైటిల్ అనుకుంటున్నారు అని అనేక వార్తలు వచ్చాయి.

కొంత కాలం నుండి ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ను ఫిక్స్ చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ప్రస్తుతం మాత్రం ఈ మూవీ యూనిట్ డాకు మహారాజ్ అనే టైటిల్ ను పక్కన పెట్టేసి సర్కార్ సీతారాం అనే టైటిల్ను ఈ మూవీ కి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>