MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vijayashanti-bhanumathi-gari-mogudu-movie637baa05-106e-4474-9f69-f0a122f32fbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vijayashanti-bhanumathi-gari-mogudu-movie637baa05-106e-4474-9f69-f0a122f32fbd-415x250-IndiaHerald.jpgఏంటి బాలకృష్ణ ప్రేమించిన హీరోయిన్ తోనే రాఖీ కట్టించుకున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు బాలకృష్ణకు రాఖీ కట్టింది అనేది ఇప్పుడే చూద్దాం.. బాలకృష్ణ ప్రేమించిన హీరోయిన్ అంటే అందరికీ టక్కును గుర్తుకు వచ్చేది విజయశాంతి మాత్రమే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ వచ్చిన వార్తల్లో ఉన్నది ఎంత నిజమో కానీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో హిట్ పెయిర్ గా మారారు... అలా వీరి కాంబినేషన్లో దాదాపు 17 సినిమాలు వచ్చాయి. ఆ 17 సినిమాల్లో వీరిద్దరి యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఆన్ స్క్రీన్ మీద వీరBALAKRISHNA; VIJAYASHANTI; BHANUMATHI GARI MOGUDU MOVIE{#}Vijayashanti;bhanumathi old;Cheque;Crush;prema;Balakrishna;Nijam;Husband;marriage;Heroine;News;netizens;festival;Loveప్రేమించిన హీరోయినే బాలయ్యకు రాఖీ కట్టిందా.. షాకింగ్ సీక్రెట్..?ప్రేమించిన హీరోయినే బాలయ్యకు రాఖీ కట్టిందా.. షాకింగ్ సీక్రెట్..?BALAKRISHNA; VIJAYASHANTI; BHANUMATHI GARI MOGUDU MOVIE{#}Vijayashanti;bhanumathi old;Cheque;Crush;prema;Balakrishna;Nijam;Husband;marriage;Heroine;News;netizens;festival;LoveWed, 30 Oct 2024 18:19:00 GMT ఏంటి బాలకృష్ణ ప్రేమించిన హీరోయిన్ తోనే రాఖీ కట్టించుకున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు బాలకృష్ణకు రాఖీ కట్టింది అనేది ఇప్పుడే చూద్దాం.. బాలకృష్ణ ప్రేమించిన హీరోయిన్ అంటే అందరికీ టక్కును గుర్తుకు వచ్చేది విజయశాంతి మాత్రమే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ వచ్చిన వార్తల్లో ఉన్నది ఎంత నిజమో కానీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో హిట్ పెయిర్ గా మారారు... అలా వీరి కాంబినేషన్లో దాదాపు 17 సినిమాలు వచ్చాయి. ఆ 17 సినిమాల్లో వీరిద్దరి యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఆన్ స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీ బాగుండడంతో చాలామంది దర్శక నిర్మాతలు విజయశాంతి,బాలకృష్ణని పెట్టి లెక్కకు మించిన సినిమాలు తీశారు. అలా వీరి జోడికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. అయితే ఎక్కువ సినిమాల్లో కలిసి నటిస్తే జనాలతో ఓ గోల ఉంటుంది. 

అదేంటంటే..వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంది అందుకే అన్ని సినిమాలు కలిసి చేస్తున్నారు అని పుకార్లు పుట్టిస్తారు.అలా బాలకృష్ణ, విజయశాంతి మధ్య కూడా ఈ వార్తలే వినిపించాయి. బాలకృష్ణ విజయశాంతి ఇద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే బాలకృష్ణ తన భార్యకి విజయశాంతి తన భర్తకి విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటారనే రూమర్లు కూడా ఫిలింనగర్లో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తలేవి నిజం కాలేదు. ఈ విషయంపై చాలామంది సినీ జర్నలిస్టులు కూడా స్పందించి వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో ఈ వార్తలు వచ్చాయి.కానీ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కానీ బాలయ్యకు విజయశాంతిపై కాస్త క్రష్ మాత్రం ఉంది అంటూ కొంతమంది చెప్పారు.

అయితే బాలకృష్ణ విజయశాంతి పెళ్లి చేసుకోబోతున్నారు అని వచ్చే వార్తలను ఈ ఇద్దరు ఖండించలేదు. కానీ విజయశాంతి మాత్రం ఈ వార్తలకు చెక్ పెట్టేలా భానుమతి గారి మొగుడు సినిమా చేసే సమయంలో రాఖీ పండుగ సందర్భంగా షూటింగ్ సెట్లోకి రాఖీలు తెప్పించి నేరుగా వెళ్లి బాలయ్య బాబుకి రాఖీ కట్టిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలకృష్ణతో నేను సినిమాల్లో  భార్యగా.. ప్రియురాలుగా.. నటించినప్పటికీ బయట మాత్రం నేను ఆయనని అన్నయ్యలాగే భావిస్తాను. అందుకే ఈ రాఖీ కట్టాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలా ఎఫైర్ వార్తలు  వచ్చిన హీరోయిన్ తోనే బాలకృష్ణ రాఖీ కట్టించుకున్నారని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 ను బీట్ చేయడానికే చరణ్ ఆ నిర్ణయం తీసుకున్నాడా.. ఆ ఏరియాలో గేమ్ చేంజర్ కి ఫుల్ ఎడ్జ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>