MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9baf674f-d360-428a-b73d-e308ba38abf7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9baf674f-d360-428a-b73d-e308ba38abf7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేమికులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమా గురించి తాజా అప్‌డేట్‌లు ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే గుంటూరు కారంతో తెరమీదకి వచ్చిన మహేష్ బాబు ఆ సినిమాతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు దానితో ఇప్పుడు రాజమౌళి తో చేస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కించాలనే ప్లాన్‌తో రాజమౌళి ముందుకు వస్తున్నారు. tollywood{#}Guntur;ashok galla;ashok;Telugu;Hero;Chitram;mahesh babu;Rajamouli;Cinemaయంగ్ హీరో సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు...లేటెస్ట్ అప్డేట్.!!యంగ్ హీరో సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు...లేటెస్ట్ అప్డేట్.!!tollywood{#}Guntur;ashok galla;ashok;Telugu;Hero;Chitram;mahesh babu;Rajamouli;CinemaWed, 30 Oct 2024 13:15:32 GMTతెలుగు సినీ ప్రేమికులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమా గురించి తాజా అప్‌డేట్‌లు ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే గుంటూరు కారంతో తెరమీదకి వచ్చిన మహేష్ బాబు ఆ సినిమాతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు దానితో ఇప్పుడు రాజమౌళి తో చేస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కించాలనే ప్లాన్‌తో రాజమౌళి ముందుకు వస్తున్నారు.

సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం, బాడీ పెంచేశారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో తీయబోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కోసం లొకేషన్ వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉంది దానితో మహేష్ బాబు మరో సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు అనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

 ఆ యంగ్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు గార్ల అశోక్. హీరో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశోక్ ఆ తర్వాత ఈ యంగ్ హీరో దేవకీ నందన వాసుదేవ అనే సినిమాతో మరోసారి తెరమీదకి వస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కృష్ణుడిగా కనిపిస్తున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు మహేష్ ను కృష్ణుడి పాత్రలో చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై అశోక్ గల్లా క్లారిటీ ఇచ్చేశారు. దేవకీ నందన వాసుదేవా సినిమాలో మహేష్ బాబు నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఈ విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>