MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak0ff1db78-18b4-40b8-9b9e-f5a0d12e92c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak0ff1db78-18b4-40b8-9b9e-f5a0d12e92c8-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం ఈ మూవీ యూనిట్ వారు ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతోంది అని అధికారికంగా ప్రకటించింది. ఇక అలా మూవీ బృందం వారు ఆగస్టు నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది అని ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అప్పటికి దేవర సినిమా కూడా విడుదల కాకపోవడంతో దేవర పనులను పూర్తి చేసి వార్ 2Tarak{#}January;kushi;Kushi;prasanth;Prasanth Neel;Prashant Kishor;prashanth neel;war;Makar Sakranti;NTR;Jr NTR;Cinema;Novemberఎన్టీఆర్ - నిల్ : ఆగస్టు అన్నారు ఇప్పటికి పత్తాలేదు.. సినిమా అయినా చెప్పిన తేదీకస్తుందా..?ఎన్టీఆర్ - నిల్ : ఆగస్టు అన్నారు ఇప్పటికి పత్తాలేదు.. సినిమా అయినా చెప్పిన తేదీకస్తుందా..?Tarak{#}January;kushi;Kushi;prasanth;Prasanth Neel;Prashant Kishor;prashanth neel;war;Makar Sakranti;NTR;Jr NTR;Cinema;NovemberWed, 30 Oct 2024 19:40:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం ఈ మూవీ యూనిట్ వారు ఎన్టీఆర్ , ప్రశాంత్ కాంబో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతోంది అని అధికారికంగా ప్రకటించింది. ఇక అలా మూవీ బృందం వారు ఆగస్టు నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది అని ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.

అప్పటికి దేవర సినిమా కూడా విడుదల కాకపోవడంతో దేవర పనులను పూర్తి చేసి వార్ 2 సినిమా పనులను కూడా స్పీడ్ గా పూర్తి చేసి ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేస్తాడు. దానితో ఆ మూవీ పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి.  ఎన్టీఆర్ దానితో మొదట దేవర పార్ట్ 1 సినిమాతో ఆ తర్వాత వార్ 2 ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ఆ వెంటనే దేవర ఆర్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. దానితో వరుస పెట్టి ఎన్టీఆర్ సినిమాలు విడుదల అవుతాయి అని ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు.

ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వీరి కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల చివరన అనగా నవంబర్ చివరి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2026 వ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ తేదీకైనా ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే.. పెద్ద టార్గెట్ పాజిటివ్ టాక్ రాకుంటే అంతే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>