MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vs-ramcharan638aade7-bafc-4d39-95a4-6f05ca10fb94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny-vs-ramcharan638aade7-bafc-4d39-95a4-6f05ca10fb94-415x250-IndiaHerald.jpgఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. ముందుగా డిసెంబర్ 5న బన్నీ నటిస్తున్న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న రాంచరణ్ - శంకర్ కాంబినేషన్లో తెర‌కెక్కనున్న గేమ్‌ఛేంజ‌ర్‌ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాలు హడావుడి. ఈ ఇద్దరు హీరోల పరోక్ష పోటీ కనిపిస్తోంది. ఓ నెల రోజులపాటు అటు రాంచరణ్.. ఇటు అల్లు అర్జున్.. తమ సినిమాల ప్రచారాలతో దుమ్ము దుల‌పనున్నారు. Bunny Vs Ramcharan{#}January;producer;Producer;shankar;king;ram pothineni;November;December;India;Makar Sakranti;Allu Arjun;GEUM;Event;Ram Charan Teja;Audience;Yevaru;Cinemaబ‌న్నీ Vs రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య కొత్త వార్‌... ఎవ్వ‌రూ త‌గ్గేదేలే..?బ‌న్నీ Vs రామ్‌చ‌ర‌ణ్ మ‌ధ్య కొత్త వార్‌... ఎవ్వ‌రూ త‌గ్గేదేలే..?Bunny Vs Ramcharan{#}January;producer;Producer;shankar;king;ram pothineni;November;December;India;Makar Sakranti;Allu Arjun;GEUM;Event;Ram Charan Teja;Audience;Yevaru;CinemaTue, 29 Oct 2024 14:14:00 GMTప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు మెగా క్రేజీ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమాల హడావుడి నడుస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. ముందుగా డిసెంబర్ 5న బన్నీ నటిస్తున్న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న రాంచరణ్ - శంకర్ కాంబినేషన్లో తెర‌కెక్కనున్న గేమ్‌ఛేంజ‌ర్‌ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాలు హడావుడి. ఈ ఇద్దరు హీరోల పరోక్ష పోటీ కనిపిస్తోంది. ఓ నెల రోజులపాటు అటు రాంచరణ్.. ఇటు అల్లు అర్జున్.. తమ సినిమాల ప్రచారాలతో దుమ్ము దుల‌పనున్నారు.


వీళ్లిద్దర ప్రచారం ముందు మరో సినిమా తెలిపోవడం ఖాయం. అందుకే గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. దీనికోసం మూడేళ్ల నుంచి మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా చాలాసార్లు రిలీజ్ డేట్‌లు మార్చి.. ఎట్టకేలకు సంక్రాంతి డేట్ లాక్ చేశారు. త్వరలోనే టీజర్ రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రాగా.. నవంబర్లో మరో మూడు పాటలు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో పూర్తిస్థాయిలో గ్రాండ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇక ట్రైలర్ కూడా రిలీజ్ కావాలి. గేమ్ ఛేంజర్ కంటే ముందు రిలీజ్ అవుతున్న పుష్ప 2 విషయంలో కూడా పక్కా ప్రమోషనల్ రెడీ అయింది.


నవంబర్ నెల పుష్ప2కు చాలా కీలకంగా.. వచ్చే నెల నుంచి ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయాలి. ఇక ట్రైలర్ కూడా నవంబర్లోనే ఉంటుంది. బన్నీ కూడా నార్త్ ఇండియా పై బాగా గురిపెట్టి నార్త్ ఇండియాలో గట్టిగా ప్రమోషన్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా రాబోయే నెల రోజులు ఇటు పుష్ప‌2.. అటు గేమ్ ఛేంజర్ సినిమాల కోసం బన్నీ, రామ్ చరణ్ తమ ప్రచారాలతో ఓరెక్కించనున్నారు. మరి ఇద్దరిలో సినిమాల రిలీజ్ కి ముందు.. సినిమాల రిలీజ్ తర్వాత ఎవరు ప్రచారాల్లో పై చేయి సాధిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండింగ్ లో 'మనసిలాయే సాంగ్ '.. వీడియో అదిరిందిగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>