MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-s-remuneration-for-venkatesh-76-is-this0ae156bd-0e64-4e77-930b-6139e5308921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anil-ravipudi-s-remuneration-for-venkatesh-76-is-this0ae156bd-0e64-4e77-930b-6139e5308921-415x250-IndiaHerald.jpgతొలి సినిమా నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెర‌కెక్కించిన పటాస్ నుంచి.. గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణతో తెర‌కెక్కించిన భగవంత్‌ కేసరి సినిమా వరకు.. అసలు అనిల్ రావిపూడికి అపజయం అన్నది లేదు. కమర్షియల్ సినిమాలను, కామెడీ సినిమాలను, కుటుంబ కథా సినిమాలను అందరూ మెచ్చే విధంగా చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. Anil Ravipudi{#}aishwarya rajesh;anil ravipudi;Kesari;Pataas;Pattas;Comedy;anil music;Venkatesh;Darsakudu;Director;India;Makar Sakranti;Tollywood;kalyan;Hero;Cinemaవెంక‌టేష్ 76 సినిమాకు అనిల్ రావిపూడి రెమ్యున‌రేష‌న్ ఇదే..!వెంక‌టేష్ 76 సినిమాకు అనిల్ రావిపూడి రెమ్యున‌రేష‌న్ ఇదే..!Anil Ravipudi{#}aishwarya rajesh;anil ravipudi;Kesari;Pataas;Pattas;Comedy;anil music;Venkatesh;Darsakudu;Director;India;Makar Sakranti;Tollywood;kalyan;Hero;CinemaTue, 29 Oct 2024 14:09:14 GMT- ప‌టాస్ టు భ‌గ‌వంత్ కేస‌రి వ‌ర‌కు అప‌జ‌యం లేని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి
- వెంక‌టేష్ సినిమాకు రు. 30 కోట్ల రెమ్యున‌రేష‌న్ .. ?


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. తొలి సినిమా నందమూరి కళ్యాణ్ రామ్‌తో తెర‌కెక్కించిన పటాస్  నుంచి.. గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణతో తెర‌కెక్కించిన భగవంత్‌ కేసరి సినిమా వరకు.. అసలు అనిల్ రావిపూడికి అపజయం అన్నది లేదు. కమర్షియల్ సినిమాలను, కామెడీ సినిమాలను, కుటుంబ కథా సినిమాలను అందరూ మెచ్చే విధంగా చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత.


టాలీవుడ్ రోహిత్ శెట్టి అంటూ చాలామంది అనిల్ రావిపూడిని ప్రశంసిస్తూ ఉంటారు. టికెట్ కి పెట్టిన డబ్బులకి న్యాయం చేసేలా అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయి. అందువల్లే అతడికి డిమాండ్ బాగా ఎక్కువ. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2025 సంక్రాంతి కనుక ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కోసం రెండు, మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


సినిమా కోసం హీరో వెంకటేష్ కంటే కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఎక్కువ పారితోషకం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వెంకటేష్‌కు రూ.18 కోట్ల పారితోషం ఇస్తే.. అనిల్ రావిపూడి రూ.25 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక లాభాల్లో అనిల్ రావిపూడికి ఇప్పటికే వాటా కూడా ఉంటుందని తెలుస్తోంది. అలా చూసుకున్న అనిల్ రావిపూడి పారితోషకం రూ.30 కోట్ల వరకు వెళుతోంది. ఏది ఏమైనా వరుస సూపర్ డూపర్ హిట్టులతో అనిల్ రావిపూడి టాలీవుడ్ లోనే తిరుగులేని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>