MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde628ee09a-6876-427f-9348-553f59803b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde628ee09a-6876-427f-9348-553f59803b17-415x250-IndiaHerald.jpgఅందాల తార పూజా హెగ్డే గురించి జనాలకు పరిచయం అక్కర్లేదు. ఆమె నవ్వుకి యావత్ తెలుగు కుర్రకారు కుదేలు అయింది. దాంతో అమ్మడుకి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ముకుంద' అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకుంది. ఈ క్రమంలో చేసిన అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ సినిమాలతో పూజ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. Pooja Hegde{#}Aravinda Sametha Veera Raghava;kushi;tara;varun tej;Heroine;media;Fashion;Tollywood;Indian;Pooja Hegde;Diwali;Teluguదీపావళికి చిచ్చు పెట్టనున్న పూజా హెగ్డే... కాస్త డోస్ పెంచి!దీపావళికి చిచ్చు పెట్టనున్న పూజా హెగ్డే... కాస్త డోస్ పెంచి!Pooja Hegde{#}Aravinda Sametha Veera Raghava;kushi;tara;varun tej;Heroine;media;Fashion;Tollywood;Indian;Pooja Hegde;Diwali;TeluguMon, 28 Oct 2024 13:45:00 GMT
అందాల తార పూజా హెగ్డే గురించి జనాలకు పరిచయం అక్కర్లేదు. ఆమె నవ్వుకి యావత్ తెలుగు కుర్రకారు కుదేలు అయింది. దాంతో అమ్మడుకి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ముకుంద' అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకుంది. ఈ క్రమంలో చేసిన అల వైకుంఠపురములో, అరవింద సమేత వీరరాఘవ సినిమాలతో పూజ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది.

ఇటీవల తెలుగులో సినిమాలను తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ జనాలకు ఖుషీ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఘాటైన ఫోటోషూట్ ద్వారా సోషల్ మీడియాలో చిచ్చు రేపిన పూజ రానున్న దీపావళి కోసం కూడా సరికొత్త అందాలతో పండగ వేడుకలను రెడీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే స్వచ్ఛమైన సిల్వర్ టాప్, గ్రీన్ ఎయిర్‌డ్రాప్ జ్యూవెలరీతో ఆమె లుక్ ఎంతో గ్లామరస్‌గా ఉందంటూ సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు. సింపుల్ కానీ క్లాసిక్ లుక్‌లో కనపడుతూ పూజా హెగ్డే అందరికీ దీపావళి స్పెషల్ గా రాబోతోందంటూ క్యాప్షన్ పెట్టి మరీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా పూజ కధా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఆమె చేసిన "హౌస్‌ఫుల్ 4", "మొహంజోదారో" వంటి సినిమాలు క్రిటిక్స్ మెప్పుని పొందాయి అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పూజ ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఉన్న బిజీ హీరోయిన్‌లలో ఒకరుగా కొనసాగుతూనే, సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. మొత్తానికి, ఫ్యాషన్ మరియు అందంతోనే కాకుండా, తన నటనతోనూ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంతో బిజీ అయిపోయింది పూజా హెగ్డే. మీలో ఎంతమందికి ఈ ముద్దుగుమ్మ అంటే ఇష్టమో ఇక్కడ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య నక్క తోక తొక్కాడుగా.. మరో నాలుగేళ్ల వరకు ఆయనకు తిరుగులేనట్టే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>