MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa368206b6e-87e3-4297-ac46-039c41545a16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa368206b6e-87e3-4297-ac46-039c41545a16-415x250-IndiaHerald.jpgఇపుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా పుష్ప 3 గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం ఈ సినిమా ఇప్పటినే ప్రీ రిలీజ్ బిజినెస్ కింద దాదాపు 1000 కోట్లకు పైగానే చేసిందని వినికిడి. ఇదే విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటించడంతో అంతా అవాక్కవుతున్నారు. పుష్ప-1 ది రైజ్ సినిమాకి పుష్ప-2 ది రూల్ సీక్వెల్ గా వస్తున్న సంగతి విదితమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ pushpa3{#}producer;Producer;trivikram srinivas;sukumar;Ram Charan Teja;Allu Arjun;Blockbuster hit;India;News;Cinemaపుష్ప 3 లీడ్ అదిరిపోయింది... ఇక బన్నీకి ఎదురులేదుగా?పుష్ప 3 లీడ్ అదిరిపోయింది... ఇక బన్నీకి ఎదురులేదుగా?pushpa3{#}producer;Producer;trivikram srinivas;sukumar;Ram Charan Teja;Allu Arjun;Blockbuster hit;India;News;CinemaSat, 26 Oct 2024 14:55:00 GMT
ఇపుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా పుష్ప 3 గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం ఈ సినిమా ఇప్పటినే ప్రీ రిలీజ్ బిజినెస్ కింద దాదాపు 1000 కోట్లకు పైగానే చేసిందని వినికిడి. ఇదే విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటించడంతో అంతా అవాక్కవుతున్నారు. పుష్ప-1 ది రైజ్ సినిమాకి పుష్ప-2 ది రూల్ సీక్వెల్ గా వస్తున్న సంగతి విదితమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో అయితే అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు నేషనల్ అవార్డ్ ను కూడా తెచ్చిపెట్టింది పుష్ప సినిమా. అదే సమయంలో సెకండ్ పార్ట్ పై మంచి హోప్స్ క్రియేట్ చేసింది.

త్వరలో పుష్ప-2 రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో ఇపుడు గత కొన్ని రోజులుగా... పుష్ప-3 సినిమా కోసం కూడా కొన్ని గుసగుసలు వినబడడం సాధారణమైన విషయం అయిపోయింది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ రెండు పార్టులు హిట్స్ అయ్యాక మూడో పార్ట్ కోసం చర్చలు జరగడం కామనే. అయినప్పటికీ పుష్ప-2 రిలీజ్ కాకముందే పుష్ప-3పై ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకే మూడో భాగం రానుందని వార్తలు రాగా.. రీసెంట్ గా నిర్మాత రవిశంకర్ కన్ఫర్మ్ చేశారు. కచ్చితంగా మూడో భాగం ఉంటుందని.. అందుకు కావాల్సిన లీడ్ పుష్ప-2లో ఇస్తున్నట్లు కూడా తెలపడంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ తరుణంలోనే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుంది? అనే విషయం పైన ఆరా తీస్తున్నారు జనాలు. అయితే ఇప్పుడు పుష్ప-3ని వెంటనే స్టార్ట్ చేయడానికి రెడీగా లేరని తెలుస్తోంది. పెద్ద బ్రేక్ తీసుకొని, ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాని చేసాక, పుష్ప గురించి అల్లు అర్జున్ ఆలోచిస్తారని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్.. కూడా రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి రెండేళ్లు పడుతుంది! అటు అల్లు అర్జున్ కూడా ఖాళీ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది కాబట్టి పుష్ప-3కి లీడ్ ఉన్నా.. ఇప్పట్లో సినిమా తెరకెక్కే ఛాన్స్ లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>