Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-sharmila010c9042-e93c-4f9a-9548-ef6b958b8017-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-sharmila010c9042-e93c-4f9a-9548-ef6b958b8017-415x250-IndiaHerald.jpgతాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వ్యక్తి జగన్‌ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి, జగన్ ఏం చెబితే అది మాట్లాడుతాడు. తనకంటూ ఓ క్లారిటీ ఉండదు. జగనన్న విదిలించిన అన్నం మెతుకులు తిని బతికేస్తాడు... అయితే విశ్వాసం ఉంటుందో లేదో మరి ఆ దేవుడికే తెలియాలి! మా అన్నకైతే ఎలాగూ తెలియదు! అని మండిపడ్డారు. yS Sharmila{#}Vijayawada;bharathi old;Jagan;Andhra Pradesh;Nijam;media;Party;Fatherనా బిడ్డలపై ప్రమాణం చేయగలను.. వారు చేయగలరా: వైస్ షర్మిళనా బిడ్డలపై ప్రమాణం చేయగలను.. వారు చేయగలరా: వైస్ షర్మిళyS Sharmila{#}Vijayawada;bharathi old;Jagan;Andhra Pradesh;Nijam;media;Party;FatherSat, 26 Oct 2024 17:16:00 GMT
తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వ్యక్తి జగన్‌ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి, జగన్ ఏం చెబితే అది మాట్లాడుతాడు. తనకంటూ ఓ క్లారిటీ ఉండదు. జగనన్న విదిలించిన అన్నం మెతుకులు తిని బతికేస్తాడు... అయితే విశ్వాసం ఉంటుందో లేదో మరి ఆ దేవుడికే తెలియాలి ! మా అన్నకైతే ఎలాగూ తెలియదు! అని మండిపడ్డారు.

విషయం లోకి వెళితే, విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడుతూ.. సుబ్బారెడ్డిపై విరుచుకు పడ్డారు. ఆమె మాట్లాడుతూ... ‘‘నా బిడ్డలు వారి కళ్ల ముందే పెరిగారు. వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? అన్ని విషయాలు తెలిసి కూడా బాబాయి ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదు!’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... ‘‘అయినా జగన్‌ పదవులు ఇస్తేనే సుబ్బారెడ్డి అనుభవిస్తున్నారు.. ఆయన అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడుతారు? ఇక్కడ వారికి నీతి ఎలా ఉంటుంది? కానీ నాన్న పైనుండి అన్నీ చూస్తున్నారు! అందరికీ సమాధానం చెప్పే రోజు తప్పక వస్తుంది!” అంటూ మాట్లాడరు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. వారు నామీద చేస్తున్న ఆరోపణలు నిజం కాదు... సుబ్బారెడ్డి, జగన్‌ ఇద్దరూ వారి బిడ్డలపై నాలా ప్రమాణం చేసి చెప్పగలరా? నాకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఏవో చెబితే ఎలా? సాక్షిలో, భారతి సిమెంట్స్‌లో వాటాలు మావని జగన్‌ ఎలా చెబుతారు? భారతి పేరు మీద ఆస్తులు ఉంటే ఆమె ఎందుకు జైలుకు వెళ్లలేదు? ఎవరైనా గిఫ్ట్‌ ఇస్తే ఎంవోయూ రాసుకుంటారా? మీరు ఎంవోయూ రాశారంటేనే ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అర్థం. దీనికి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి? అంటూ ఆమె మీడియా ముఖంగా ప్రశ్నించారు!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రివ్యూయర్స్ పై.. నీచమైన కామెంట్స్ తో ఫైర్ అయిన టాలీవుడ్ నటుడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>