MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tabua70bcaf9-805e-44c1-8e13-b2cab25ed974-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tabua70bcaf9-805e-44c1-8e13-b2cab25ed974-415x250-IndiaHerald.jpgసీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నటువంటి నటి టబు అని చెప్పవచ్చు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ బ్యూటీ హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగార్జునతో ఆమె నటించిన హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. tabu{#}Hello;prema;Manam;Tabu;Hyderabad;bollywood;Tollywood;Yevaru;Success;Audience;media;BEAUTY;Love;Cinemaఆ వ్యాపారవేత్తతో నాగార్జున హీరోయిన్‌ సీక్రెట్‌ రిలేషన్‌ ?ఆ వ్యాపారవేత్తతో నాగార్జున హీరోయిన్‌ సీక్రెట్‌ రిలేషన్‌ ?tabu{#}Hello;prema;Manam;Tabu;Hyderabad;bollywood;Tollywood;Yevaru;Success;Audience;media;BEAUTY;Love;CinemaSat, 26 Oct 2024 14:50:00 GMTసీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నటువంటి నటి టబు అని చెప్పవచ్చు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోనూ ఈ బ్యూటీ హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగార్జునతో ఆమె నటించిన హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఈ సినిమాని ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూ ఉండడం విశేషం. టాలీవుడ్ తో మాత్రమే కాక హైదరాబాద్ తోనూ ఈ బ్యూటీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టబు చిన్నతనం మొత్తం హైదరాబాద్ లోనే గడిపింది. ఇక్కడే మల్లెపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి టబు చాలా కాలం నివసించింది. విజయనగర్ కాలనీలోని సెంట్ ఆన్స్ హైస్కూల్ లోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది. టబు ముందు హైదరాబాద్ అని ఆ తర్వాత బాలీవుడ్ నటిని అనే చాలాసార్లు చెబుతూ ఉండడం మనం వినే ఉన్నాం. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత టబు మళ్ళీ అలా వైకుంఠపురం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఈ మధ్యకాలంలోనే హిందీలో క్రూ అనే సినిమాలో కనిపించి మెప్పించింది. త్వరలో ఆమె డ్యూన్ ప్రొఫెసి అనే ఒక ఇంటర్నేషనల్ ఫ్రీక్వల్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆమె సిస్టర్ ఫ్రాన్సెస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ మీద మరింత ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉండగా.... టబుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నిన్నే పెళ్ళాడుతా, హలో బ్రదర్ వంటి సినిమాల్లో ఈ బ్యూటీ నాగార్జున సరసన నటించింది.


వారి మధ్య ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య కాస్త ప్రేమ చిగురించిందని అప్పట్లో ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తుందట. ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>