MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya31ad5fee-d465-4ce4-834c-eaa09c011af8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya31ad5fee-d465-4ce4-834c-eaa09c011af8-415x250-IndiaHerald.jpgముఖ్యంగా 2025 సంక్రాంతికి కూడా ఎప్పటిలాగానే పోటీ తీవ్రంగా ఉండే విధంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ‌ మూవీ సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నట్లు ఇప్పటికే అధికార ప్ర‌క‌ట‌న‌ వచ్చేసాయి. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి వార్‌లో నిలిచే అవకాశం ఉంది. Balayya{#}Makar Sakranti;GEUM;Chiranjeevi;Tollywood;vegetable market;Ram Charan Teja;Pawan Kalyan;Balakrishna;Telugu;Cinemaరామ్ చరణ్ కు గట్టి రాడ్ వేసిన బాలయ్య.. అక్కడ ఆయనదే పై చేయి..!రామ్ చరణ్ కు గట్టి రాడ్ వేసిన బాలయ్య.. అక్కడ ఆయనదే పై చేయి..!Balayya{#}Makar Sakranti;GEUM;Chiranjeevi;Tollywood;vegetable market;Ram Charan Teja;Pawan Kalyan;Balakrishna;Telugu;CinemaSat, 26 Oct 2024 15:55:35 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సినిమాల హడావుడి చాలా కనిపిస్తుంది.. ఆ సమయంలో తమ సినిమాలు విడుదల చేసేందుకు దర్శకుల‌ తో పాటు హీరోలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా వరుస సెలవలు ఉండటంతో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తుంటారు కాబట్టి.. ఇప్పుడు వచ్చే ఏడాది కూడా చాలా పెద్ద సినిమాలు పోటీకి నిలుస్తున్నాయి. ముఖ్యంగా 2025 సంక్రాంతికి కూడా ఎప్పటిలాగానే పోటీ తీవ్రంగా ఉండే విధంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ‌ మూవీ సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నట్లు ఇప్పటికే అధికార ప్ర‌క‌ట‌న‌ వచ్చేసాయి. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి వార్‌లో నిలిచే అవకాశం ఉంది.


ఇక్కడ నిజానికి ప్రతి సంక్రాంతికి మెగా - నందమూరి హీరోల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.. ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి పండుగను రసవత్తరంగా మార్చారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి స్థానంలో ఆయన కొడుకు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజెర్ బాలయ్య మూవీ తో యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే.  అయితే 'గేమ్ చేంజర్', బాలయ్య సినిమాకి పోటీ ఉన్న నేపథ్యంలో వీటిలో ఏది హిట్ అవుతుంది?  దేనికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? ఏ సినిమా ఎక్కువ బిజినెస్ జరుగుతుందని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోని ఓ ఏరియా బిజినెస్ విషయంలో రామ్ చరణ్ కంటే  బాలయ్యదే పే చెయ్ అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.


ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ఏరియాకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ మన తెలుగులో కొందరు హీరోలకు మాత్రమే గట్టి ప్రభావం చూపిస్తారు. అందులో నట‌సింహం ఒకరు . ఇప్పుడు ఆయన నటించిన సినిమాలకు ఇక్కడ భారీ రెస్పాన్స్ కూడా అందుతుంది. అందుకే ఇప్పుడు తన 109వ సినిమాకు 19 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ కెరియర్ లోని అత్యధిక హైయెస్ట్ బిజినెస్ అని సమాచారం. అయితే రామ్ చరణ్ కూడా సీడెడ్ లో మంచి మార్కెట్ ఉంది కానీ గేమ్ ఛేంజర్‌కు ఇక్కడ కేవలం 15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా బాలయ్య, రామ్ చరణ్ కు గడ్డి రాడ్ దింపాడు .
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>