PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-jagan-yv-subba-reddy-comments-viral0125ebbc-6376-4abb-99e7-9fc557f75824-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-jagan-yv-subba-reddy-comments-viral0125ebbc-6376-4abb-99e7-9fc557f75824-415x250-IndiaHerald.jpgవైయస్సార్ కుటుంబంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల ఆస్తి పంపకాలు వ్యవహారం పైన గత రెండు రోజుల నుంచి ఏవో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ విషయం పైన అటు జగన్ ,ఇటు షర్మిల ఇద్దరు కూడా పలు రకాల నోట్లను విడుదల చేశారు. అయితే ఈ విషయం పైన తాజాగా వైసీపీ ఎంపీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా పలు విషయాలను తెలియజేశారు. సరస్వతి సిమెంట్ లో షేర్లు ఈడి అటాచ్ ఉండగానే హైకోర్టులో కూడా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసి జగన్ కు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియకుండా తన తల్లి విజయమ్మ పేరు SHARMILA;JAGAN;YV SUBBA REDDY;COMMENTS;VIRAL{#}contract;prema;Husband;Love;Jagan;Sharmila;Reddy;YCP;Congress;media;TDPషర్మిల - జగన్: ఆస్తుల విషయంపై ..బాబాయ్ హాట్ కామెంట్స్..!షర్మిల - జగన్: ఆస్తుల విషయంపై ..బాబాయ్ హాట్ కామెంట్స్..!SHARMILA;JAGAN;YV SUBBA REDDY;COMMENTS;VIRAL{#}contract;prema;Husband;Love;Jagan;Sharmila;Reddy;YCP;Congress;media;TDPSat, 26 Oct 2024 08:00:00 GMTవైయస్సార్ కుటుంబంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిల ఆస్తి పంపకాలు వ్యవహారం పైన గత రెండు రోజుల నుంచి ఏవో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ విషయం పైన అటు జగన్ ,ఇటు షర్మిల ఇద్దరు కూడా పలు రకాల నోట్లను విడుదల చేశారు. అయితే ఈ విషయం పైన తాజాగా వైసీపీ ఎంపీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా పలు విషయాలను తెలియజేశారు.


సరస్వతి సిమెంట్ లో షేర్లు ఈడి అటాచ్ ఉండగానే హైకోర్టులో కూడా ఉండడం వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసి జగన్ కు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియకుండా తన తల్లి విజయమ్మ పేరు మీద షర్మిల షేర్లను కూడా బదిలీ చేసుకున్నారంటూ తెలిపా. జగన్ జైలుకు వెళ్లడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ మరొకసారి ఆయన గుర్తు చేశారు. ఇదంతా టీడీపీ కుట్రలో భాగంగానే షర్మిల చేస్తోందనే విధంగా కూడా తెలిపారు. అందుకే ఆ పరిస్థితుల్లో జగన్ తనను తాను కాపాడుకోవడం కోసమే ఈ కేసు పైన పిటిషన్ దాకలు వేశారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.


ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం తల్లి, చెల్లిని కోర్టుకి ఈడ్చారని.. వైయస్సార్ మరణించిన తర్వాత పదేళ్లకి చెల్లిపై అభిమానంతో ఇవ్వాలనుకున్న ఆస్తులను ఒప్పందం చేసుకున్నారంటూ తెలిపారు.. ప్రేమ అభిమానం లేకపోతే పదేళ్ల తర్వాత ఇలాంటి ఒప్పందం చేసుకోరు కదా అంటూ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి. అయితే జగన్ కష్టార్జితం ఈ ఆస్తులను ఆ ఒప్పందంలో ఉందని ఇది చూశాక షర్మిల సంతకం పెట్టిందని కూడా తెలిపారు. వైయస్సార్ బతికున్నప్పుడే షర్మిలాకు కూడా ఆస్తి పంచించారని తెలియజేశారు.


గతంలో కూడా షర్మిల, జగన్ ఒప్పందం ప్రకారం ఆస్తులు కావాలని అడగడంతో  అప్పుడు ఎన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చినా కూడా పట్టించుకోకుండా బదిలీ చేశాడని తెలిపారు సుబ్బారెడ్డి. అయితే ఇప్పుడు మీడియాలో మాట్లాడడం వెనుక ఆమె ఉద్దేశం ఏమిటంటు కూడా ప్రశ్నించడం జరిగింది. వైయస్సార్ మరణం తర్వాత ఆస్తులను అభివృద్ధి చేయడంలో షర్మిల పాత్ర ఎక్కడా లేదని.. అయిన కూడా షర్మిలకు న్యాయపరమైన వాటా ఇచ్చారని. మరి ఈడీ,సీబీఐ కేవలం జగన్ పైన మాత్రమే ఎందుకు కేసులు పెట్టారని ఆమెను ఎందుకు వదిలేసారు అంటూ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించడం జరిగింది.


జగన్ కంపెనీలలో వచ్చిన డివిడెండ్లకు కూడా షర్మిల కు ఇచ్చారని తెలిపారు. అలాగే నలుగురు పిల్లలకు ఆస్తుల సమాన వాటా విషయం పైన స్పందిస్తు.. షర్మిల కానీ ఆమె భర్త కాని ఎప్పుడూ కూడా ఏ కంపెనీలలో డైరెక్ట్ గా పెట్టుబడులు పెట్టలేదని.. వైయస్సార్ బతికి ఉన్నప్పుడే పెట్టిన కంపెనీలలో షర్మిలను చేర్చాలని ఒప్పందం చేసి ఉంటే జగన్ కచ్చితంగా వాటా ఇచ్చేవారని తెలిపారు. ఈ విషయంలో జగన్ అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని కూడా తెలిపారు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వేట్టయన్ టైటిల్ ఇష్యూ.. ఏకంగా రంగంలోకి దిగాల్సి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>