MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoora3bcfba7-2a3f-489e-87f6-38423d3da78d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoora3bcfba7-2a3f-489e-87f6-38423d3da78d-415x250-IndiaHerald.jpgఇక అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్‌ తీసుకు రాలేక పోయింది . ఇప్పుడు తెలుగులో తన ల‌క్‌ను పరిశీలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ మేరకు ఎన్టీఆర్ హీరోకు వచ్చిన దేవర సినిమాలో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. అయితే దేవర తొలి భాగంలో జాన్వీ ఎక్కువసేపు కనిపించలేదని కంప్లైంట్స్ వచ్చాయి .. ఆమె పాత్ర కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అసలు అనిపించలేదని రకరకాల కామెంట్లు బయటకు వచ్చాయి. Janhvi Kapoor{#}Sridevi Kapoor;Janhvi Kapoor;Good news;Good Newwz;Ram Charan Teja;Heroine;NTR;bollywood;Cinema;Newsహమ్మయ్య.. ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న జాన్వీ కపూర్.. పండగేగా..!హమ్మయ్య.. ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్న జాన్వీ కపూర్.. పండగేగా..!Janhvi Kapoor{#}Sridevi Kapoor;Janhvi Kapoor;Good news;Good Newwz;Ram Charan Teja;Heroine;NTR;bollywood;Cinema;NewsFri, 25 Oct 2024 16:30:00 GMTఅతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది . ఇక అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్‌ తీసుకు రాలేక పోయింది . ఇప్పుడు తెలుగులో తన ల‌క్‌ను  పరిశీలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ మేరకు ఎన్టీఆర్ హీరోకు వచ్చిన దేవర సినిమాలో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. అయితే దేవర తొలి భాగంలో జాన్వీ ఎక్కువసేపు కనిపించలేదని కంప్లైంట్స్ వచ్చాయి .. ఆమె పాత్ర కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అసలు అనిపించలేదని రకరకాల కామెంట్లు బయటకు వచ్చాయి.


అయితే ఇప్పుడు ఆమె అభిమానులకు పండగ చేసుకునే ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది . అసలు విషయం ఏమిటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న RC 16 సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తుంది. బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ మైసూర్లో నవంబర్లో ప్రారంభం కానుంది. ఇక తర్వాత హైదరాబాద్కు చిత్ర యూనిట్ రానుంది. రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తన బాడీని ప్రిపేర్ చేసుకుంటున్నాడు . మూవీ టీం కూడా ఇప్పటికే మిగతా పాత్రధారులు అందరినీ ఫైనలైజ్ చేసింది.


ఇప్పటికే హీరోయిన్ సైతం ఫైనల్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్ గా మరొక బాలీవుడ్ హీరోయిన్ ని దింపే ఆలోచన ఉందని ఈ మధ్య ప్రచారం కూడా జరిగింది . అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాల్లో కేవలం ఒకే ఒక హీరోయిన్ ఉంటుందని అది కూడా జాన్వి కపూర్ మాత్రమే అని అంటున్నారు. ఈ సినిమాలో వేరే హీరోయిన్ ఎవరూ ఉండరని కూడా అంటున్నారు .. ఒకరకంగా ఇది జాన్వి కపూర్ కు మాత్రమే కాదు ఆమె అభిమానులు కూడా కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీ స్కెచ్..షర్మిలకు 16 నెలల జైలు శిక్ష?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>