PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/behind-sharmila-s-assets-these-are-the-reasons-given-by-jagan0ddd79ae-65f1-415d-bb02-31596d2f46ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/behind-sharmila-s-assets-these-are-the-reasons-given-by-jagan0ddd79ae-65f1-415d-bb02-31596d2f46ca-415x250-IndiaHerald.jpg తాజాగా జగన్.. సోదరి షర్మిలారెడ్డికి ఇచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటున్నట్టు రాసిన లేఖ‌.. ఇప్పుడు సంచలనం రేపుతుంది. నన్ను రాజకీయంగా వ్యతిరేకించడంతోపాటు.. నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నాకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. నీ చర్యలు తీవ్రంగా బాధించాయి. అందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డిడ్ కింద నీకు రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్.. సోదరి షర్మిలకు లేఖ రాశారు. Sharmila{#}pratishta;Gift;advertisement;Sharmila;Reddy;Jagan;devineni avinash;Andhra Pradesh;Letter;court;Father;Wifeష‌ర్మిల ఆస్తులు వెన‌క్కి... జ‌గ‌న్ చెప్పిన కార‌ణాలు ఇవే...!ష‌ర్మిల ఆస్తులు వెన‌క్కి... జ‌గ‌న్ చెప్పిన కార‌ణాలు ఇవే...!Sharmila{#}pratishta;Gift;advertisement;Sharmila;Reddy;Jagan;devineni avinash;Andhra Pradesh;Letter;court;Father;WifeThu, 24 Oct 2024 15:12:06 GMTషర్మిల ఆస్తులు వెనక్కి తీసుకునేలా.. అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. తాజాగా జగన్.. సోదరి షర్మిలారెడ్డికి ఇచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటున్నట్టు రాసిన లేఖ‌.. ఇప్పుడు సంచలనం రేపుతుంది. నన్ను రాజకీయంగా వ్యతిరేకించడంతోపాటు.. నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నాకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. నీ చర్యలు తీవ్రంగా బాధించాయి. అందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డిడ్ కింద నీకు రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్.. సోదరి షర్మిలకు లేఖ రాశారు.


మనిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. అందుకే గతంలో నీకు ఇస్తున్న వాటాల‌ను రద్దు చేసుకుంటున్నానని లెక్కలో పేర్కొన్నారు. తండ్రి సంపాదించిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ఆయన జీవించి ఉన్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచారు. కానీ.. నా సొంతో పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారాలకు వారసత్వంతో సంబంధం లేకపోయినా.. నీ మీద ప్రేమతో కొన్ని ఆస్తులు నీకు ఇచ్చానంటూ జగన్ తన లేఖ‌లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో షర్మిలకు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్టు జగన్ లేఖ‌లో పేర్కొన్నారు.


ఎలాంటి అప్లికేషన్లు లేకపోయినా.. సోదరి షర్మిలపై ఉన్న ప్రేమతోనే తాను ఇలా చేసినట్టు తెలిపారు. అయినా కూడా షర్మిల ఎలాంటి కృతజ్ఞత లేకుండా తనపై విమర్శలు చేయడంతో పాటు.. రాజకీయంగా తనకు ఎదురు రావడంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే చెల్లి షర్మిల ఆలోచన, ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులు వస్తే.. కోర్టు కేసులన్నీ పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎంత చేయాలని అంశాలు పరిశీలిస్తానని కూడా తెలిపారు. ఇక తనకు వైఎస్ అవినాష్ రెడ్డి, తన భార్య భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని కూడా షర్మిలకు జగన్ లేఖ‌లో స్పష్టం చేశారు.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ నిర్మాతలపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేయడం దారుణమంటూ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>