PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sucharitha-mekathotifd7fc523-e268-4cd8-82e7-ba49625f0b90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sucharitha-mekathotifd7fc523-e268-4cd8-82e7-ba49625f0b90-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ రోజురోజుకు డీలా పడిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు జనసేన వాళ్ళకి జంపు కాగా... మరికొంతమంది నేతలు బయటికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసిపి కీలక నేత వాసిరెడ్డి పద్మ కూడా... రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. sucharitha mekathoti{#}srinivas;BALINENI SRINIVASA REDDY;Mekathoti Sucharitha;రాజీనామా;Prathipadu;Reddy;Thadikonda;Janasena;Congress;MLA;Assembly;Party;Guntur;Venkatesh;Minister;YCP;News;Jagan;Houseజనసేనలోకి మరో మహిళ నేత.. షాక్ లో జగన్ ?జనసేనలోకి మరో మహిళ నేత.. షాక్ లో జగన్ ?sucharitha mekathoti{#}srinivas;BALINENI SRINIVASA REDDY;Mekathoti Sucharitha;రాజీనామా;Prathipadu;Reddy;Thadikonda;Janasena;Congress;MLA;Assembly;Party;Guntur;Venkatesh;Minister;YCP;News;Jagan;HouseThu, 24 Oct 2024 13:17:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ రోజురోజుకు డీలా పడిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు జనసేన వాళ్ళకి జంపు కాగా... మరికొంతమంది నేతలు బయటికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  తాజాగా వైసిపి కీలక నేత వాసిరెడ్డి పద్మ కూడా... రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో కీలకంగా ఉన్న మరో మహిళా నేత జారుకునేందుకు  రెడీ అవుతున్నారట. మాజీ హోం శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత... అతి త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లబోతున్నారట. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరుగుతున్నాయట. ఆమెకు జనసేనలో కీలక పదవి ఇస్తారని కూడా... ప్రచారం జరుగుతోంది.

 వాసవంగా మేకతోటి సుచరిత కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 సంవత్సరంలో ప్రతిపాడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు సూచరిత. అయితే... జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన అభిమానంతో వైసీపీకి వచ్చారు. 2011 సంవత్సరంలో వైసిపి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత..  జగన్ పార్టీలో చేరిపోయారు మేకతోటి సుచరిత. ఈ తరుణంలోనే 2012 ఉప ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది.

ఇక 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు మేకతోటి సుచరిత. ఇక... 2019లో మాత్రం వైసిపి నుంచి పోటీ చేసి సుచరిత గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈతరణంలోనే హోమ్ మినిస్టర్ కూడా అయ్యారు సుచరిత. కానీ 2024 అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ సుచరితకు ఘోర ఓటమి ఎదురైంది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగువా కోసం అన్ స్టాపబుల్ పెద్ద ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>