MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/silk-smitha5c69e4b0-63af-414c-bf11-a340fd14137f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/silk-smitha5c69e4b0-63af-414c-bf11-a340fd14137f-415x250-IndiaHerald.jpg ఆ రోజుల్లోనే స్టార్ హీరోలకు దీటుగా రెమ్యూనిరేషన్ తీసుకున్న హీరోయిన్గా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అలాగే ఆమె కాల్షియెట్ల కోసం అప్పట్లోనే స్టార్ హీరోలు సైతం ఎదురుచూసే పరిస్థితి కూడా ఉండేది అంటే అతిశయోక్తి కాదు. కటిక పేదరికంలో జన్మించిన ఆమె హై స్కూల్ చదివే రోజుల్లోనే చదువు మానేసి ఉద్యోగం చేయాల్సి నా పరిస్థితి వచ్చింది. అలా కొన్నాళ్ళకి పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి చెన్నై వెళ్లిపోయింది. Silk Smitha{#}silk smitha;vijayalakshmi;Vemuri Radhakrishna;School;Chennai;marriage;Doctor;job;Indian;Hero;Cinemaసిల్క్ స్మిత చనిపోయినప్పుడు వచ్చిన ఏకైక స్టార్ హీరో.. ఆయన రాక వెనక అసలు స్టోరీ ఇదే..!సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వచ్చిన ఏకైక స్టార్ హీరో.. ఆయన రాక వెనక అసలు స్టోరీ ఇదే..!Silk Smitha{#}silk smitha;vijayalakshmi;Vemuri Radhakrishna;School;Chennai;marriage;Doctor;job;Indian;Hero;CinemaThu, 24 Oct 2024 16:43:00 GMTసిల్క్ స్మిత ఇది పేరు కాదు ఆటంబాంబ్ ఇండియన్ సినిమానే షేక్ చేసిన హాట్ బ్యూటీ. వ్యాంపు పాత్రలతో ఐటెం సాంగ్స్ తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత .. తన‌కుంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది. అలా ఆమె నటించే పాత్రలకు ఆ ఇమేజ్ ని ఆడ్ చేసి .. మన ఇండియన్ సినిమాలోనే అరుదైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 18 సంవత్సరాల సినీ జీవితంలో 450 కు పైగా సినిమాల్లో నటించింది అంటే ఆమె ఏ స్థాయిలో చిత్ర పరిశ్రమను ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లోనే స్టార్ హీరోలకు దీటుగా రెమ్యూనిరేషన్ తీసుకున్న హీరోయిన్గా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అలాగే ఆమె కాల్షియెట్ల కోసం అప్పట్లోనే స్టార్ హీరోలు సైతం ఎదురుచూసే పరిస్థితి కూడా ఉండేది అంటే అతిశయోక్తి కాదు. కటిక పేదరికంలో జన్మించిన ఆమె హై స్కూల్ చదివే రోజుల్లోనే చదువు మానేసి ఉద్యోగం చేయాల్సి నా పరిస్థితి వచ్చింది. అలా కొన్నాళ్ళకి పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి చెన్నై వెళ్లిపోయింది.


అలా అక్కడ సినిమాలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.  అలా సిమాల్లో అవకాశాలు తెచ్చుకుని విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఏ అవకాశాన్ని కాదనకుండా చేసుకుంటూ వచ్చింది.. అతి తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ సమయంలోనే తనకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ రాధాకృష్ణను బాగా నమ్మింది. అకౌంట్స్ అన్ని ఆయన చేతుల్లో పెట్టింది. అలా  ఆమెను పెద్ద మోసం చేసి.. సిల్క్ స్మితని రోడ్డుపాలు చేశాడు.. ఎంత పేదరికంలో పెరిగిందో సినిమాల్లోకి వచ్చాక అంతటి ఐశ్వర్యాన్ని అనుభవించింది. కానీ రాధాకృష్ణ అనే వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయింది. ఆయనకు ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. పిల్లలున్నారు. కానీ సిల్క్ స్మితని గట్టిగా వాడుకున్నారు. చివరి దశలో సినిమా ఆఫర్ల కోసం చాలా మంది మేకర్స్ వాడుకుని వదిలేశారు.


ఇలా వరుసగా మోసాలు చూసిన  సిల్క్ స్మిత్‌. తాగుడుకు బానిసైందని, డిప్రెషన్‌కి గురైందని, దీంతో ఆత్మహత్యకి పాల్పడిందని అంటారు. 1996 సెప్టెంబర్‌ 23న ఆమె మరణించింది. ఆమె అంత్యక్రియలకు సినిమా వాళ్లు రాలేదని, ఎంద‌రో స్టార్‌ల‌తో న‌టించిన ఆమెను చివ‌రి చూపు చూడానికి  కూడా రాలేద‌ని అంటారు. అయితే ఆమెను  కడసారి చూసేందుకు మాత్రం ఒక్క స్టార్‌ హీరో వచ్చాడట. ఆయన ఎవరో కాదు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌. ఆయన మాత్రమే రావడానికి ఓ కారణం ఉంది. ఆయనతో కలిసి సిల్క్ స్మిత అలిమయ్య అనే సినిమా చేసింది. ఈ మూవీ సమయంలోనే తాను చనిపోతే నువ్వైనా వస్తావా? అని అడిగిందట సరదాకి. ఆ టైమ్‌లో మాటిచ్చాడట అర్జున్‌. అయితే ఇంత త్వరగా ఇలా అవుతుందని ఊహించలేదు. అందుకే ఆమె చివరి కోరిక నెరవేర్చడం కోసం తాను వచ్చినట్టు అర్జున్‌ చెప్పడం విశేషం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>