MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-24946b21-9e48-43ca-af0e-7c90ca8b9a3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-24946b21-9e48-43ca-af0e-7c90ca8b9a3d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా పరిశ్రమలలోనే అగ్రగామిగా ఉన్న బాలీవుడ్ గతంలో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించి అందరి మన్ననలు పొందింది. ఒక్కగానొక క్షణంలో బాలీవుడ్ సౌత్ సినిమాలను చిన్న చూపు చూసేది. అలాంటి బాలీవుడ్ దాదాపు దశాబ్ద కాలానికి పైగా కుదేలు అయి కూర్చుంది. బడా బడా ఖాన్లు అందరూ ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాలో రాజ్యమేలుతున్నాయి కాబట్టి. Bollywood {#}Darling;Ishtam;Bobby Deol;surya sivakumar;Indian;Hero;Tamil;Cinema;bollywoodసౌత్ సూపర్ స్టార్ పై బాలీవుడ్లో కారు కూతలు... అభిమానులు చురకలు!సౌత్ సూపర్ స్టార్ పై బాలీవుడ్లో కారు కూతలు... అభిమానులు చురకలు!Bollywood {#}Darling;Ishtam;Bobby Deol;surya sivakumar;Indian;Hero;Tamil;Cinema;bollywoodThu, 24 Oct 2024 16:41:11 GMTబాలీవుడ్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా పరిశ్రమలలోనే అగ్రగామిగా ఉన్న బాలీవుడ్ గతంలో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించి అందరి మన్ననలు పొందింది. ఒక్కగానొక క్షణంలో బాలీవుడ్ సౌత్ సినిమాలను చిన్న చూపు చూసేది. అలాంటి బాలీవుడ్ దాదాపు దశాబ్ద కాలానికి పైగా కుదేలు అయి కూర్చుంది. బడా బడా ఖాన్లు అందరూ ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాలో రాజ్యమేలుతున్నాయి కాబట్టి.

ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్లో ఓవర్గం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దాంతోనే సందర్భం వచ్చినప్పుడల్లా వారు సౌత్ హీరోలపై ఇష్టం వచ్చినట్టు బాడీని విమర్శిస్తూ శునకానందం పొందుతున్నారు. మొన్నటికి మొన్న డార్లింగ్ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. అది మరవక ముందే తమిళ సూపర్ స్టార్ సూర్యని ఉద్దేశిస్తూ, తాజాగా బాలీవుడ్ చేస్తున్న విమర్శలను తమిళ తంబీలు తిప్పి కొడుతున్నారు.

విషయం ఏమిటంటే, తాజాగా హీరో సూర్య, తాను నటించిన "కంగువ" సినిమా ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ వెళ్ళగా, అందులో విలన్ గా నటించిన బాబీ డియోల్ తో ఒక ఫోటోని దిగడం జరిగింది. సహజంగానే సూర్య హైట్ బాబి డియోల్ కంటే కాస్త తక్కువగా ఉంది. ఇప్పుడు ఇదే అంశాన్ని వారు టార్గెట్ చేస్తూ, పొట్టి హీరో... పొట్టి హీరో... అని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో తమిళ తంబీలు రియాక్ట్ అవుతూ, ఎంత పొట్టివాడైనా, మా సూర్య గట్టివాడు! అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. కాగా బాలీవుడ్ పరిస్థితి దాదాపు కుదేలు అవుతున్న సమయంలో ఇంకా వారి గర్వం అనగలేదని సౌత్ సినిమా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. హీరో సూర్య హీరోగా, బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ప్రతి నాయకుడిగా వస్తున్న కంగువ సినిమా మరి కొన్ని రోజుల్లో సినిమా థియేటర్లలోకి రాబోతోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>