MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya-reddy86687961-1abb-4d1c-9d65-75621c21c8bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alekhya-reddy86687961-1abb-4d1c-9d65-75621c21c8bd-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు మనవడు, హీరో తారకరత్న కన్ను మూసి సంవత్సరం గడిచిపోయింది. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న మరణించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. alekhya reddy{#}alekhya;Nara Lokesh;Parents;February;TDP;Instagram;Husband;YCP;Hero;Good Newwz;Good newsఅలేఖ్యరెడ్డి గుడ్ న్యూస్.. నందమూరి ఇంట ఆ శుభకార్యం ?అలేఖ్యరెడ్డి గుడ్ న్యూస్.. నందమూరి ఇంట ఆ శుభకార్యం ?alekhya reddy{#}alekhya;Nara Lokesh;Parents;February;TDP;Instagram;Husband;YCP;Hero;Good Newwz;Good newsThu, 24 Oct 2024 15:24:00 GMTనందమూరి తారక రామారావు మనవడు, హీరో తారకరత్న కన్ను మూసి సంవత్సరం గడిచిపోయింది. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 18న మరణించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


తన భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక అలేఖ్య ఇప్పటికి కుమిలిపోతున్నారు. తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన పిల్లలతో కాలాన్ని గడుపుతోంది. ఇక అలేఖ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తారకరత్నతో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా.... ఇన్స్టా గ్రామ్ వేదికగా తాజాగా అలేఖ్య రెడ్డి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తన పెద్ద కుమార్తె నిష్మ హాఫ్ సారీ వేడుక జరిగిందని వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.



ఈ వేడుకలో తారకరత్న ఫోటో కూడా పెట్టి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని అలేఖ్య చాలా అంగరంగ వైభవంగా జరిపించింది. ఈ కార్యక్రమానికి అలేఖ్య రెడ్డి తరఫున వారి పెద్దనాన్న, వైసీపీ నేత విజయసాయిరెడ్డితో పాటు పలువురు బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకకు తారకరత్నకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా రాలేదు.


నందమూరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. దీంతో ఈ విషయం తెలిసి ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయని అందుకే ఈ వేడుకకు రాలేదంటూ కొంతమంది నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>