Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood77e8e429-fed4-489a-89c5-470388567a4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood77e8e429-fed4-489a-89c5-470388567a4b-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత విపరీతంగా క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే హీరో హీరోయిన్ల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఎంతగానో ఇష్టపడే నటీనటులు పర్సనల్ విషయాలను మాత్రం రహస్యంగానే ఉంచేవారు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ప్రతి విషయాన్ని ఇక అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అభిమానులనేkollywood{#}vikram;Illalu;Ishtam;Tamil;media;Wife;Heroహీరో విక్రమ్ కి భార్య నుంచి ఇలాంటి ఇబ్బందులా.. కొద్దిలో మంచి నటుడిని మిస్ అయ్యేవాళ్ళం?హీరో విక్రమ్ కి భార్య నుంచి ఇలాంటి ఇబ్బందులా.. కొద్దిలో మంచి నటుడిని మిస్ అయ్యేవాళ్ళం?kollywood{#}vikram;Illalu;Ishtam;Tamil;media;Wife;HeroWed, 23 Oct 2024 10:30:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత విపరీతంగా క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే హీరో హీరోయిన్ల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఎంతగానో ఇష్టపడే నటీనటులు పర్సనల్ విషయాలను మాత్రం రహస్యంగానే ఉంచేవారు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ప్రతి విషయాన్ని ఇక అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అభిమానులనే ఫ్యామిలీ గా భావిస్తూ ఉన్నారు సెలబ్రిటీలు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఆయా సెలెబ్రిటీలు చెప్పే విషయాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కాగా ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చియాన్ విక్రమ్ కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు..తమ ఇంటి ఇల్లాలు గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ ఉంటారు. భార్య సపోర్ట్ కారణంగానే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం చేయాలి విక్రమ్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయట.


 తన భార్యకు తాను సినిమాలు చేయడం అస్సలు ఇష్టం లేదు అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు. నా భార్య శైలజ నేను తొలిసారి మీట్ అయ్యే టైంకి ఒక షూటింగ్లో ప్రమాదం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నాను.  దీంతో ఆమెకు నేను సినిమాలు చేయడం ఇష్టం ఉండేది కాదు. ఇక ఆమె ఫ్యామిలీలో కూడా అందరూ కవులు మేధావులే ఉన్నారు. తనకు ఇష్టం లేకుండా సినిమాలు చేస్తున్నందుకు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడ్డా. కానీ నటనను వదులుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నా భార్య మారిపోయింది. ఇక సినిమాల విషయంలో నాకు ఎంతగానో మద్దతు ఇస్తుంది అంటూ విక్రమ్ చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నో ఈగో.. నో కాంట్రవర్సీ.. కటౌట్ కే వందల కోట్లు.. అది ప్రభాస్ రేంజ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>