MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabahs-hbd-2dfa5bf5-2a78-422e-a548-88d3f576b662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabahs-hbd-2dfa5bf5-2a78-422e-a548-88d3f576b662-415x250-IndiaHerald.jpgఅయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త అప్‌డేట్ లేకున్నా ఇందులో పలానా పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నారని మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి చాలా రకాల వార్తలు రోజు ఒక్క‌టి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో లేడీ వీల‌న్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తుందని వార్త‌ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. prabahs HBD {#}Nijam;Kareena Kapoor;Reddy;krishnam raju;sandeep;Bahubali;Film Industry;Heroine;Prabhas;Rajamouli;Hero;bollywood;India;Indian;Kannada;Cinema;News;Directorప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!prabahs HBD {#}Nijam;Kareena Kapoor;Reddy;krishnam raju;sandeep;Bahubali;Film Industry;Heroine;Prabhas;Rajamouli;Hero;bollywood;India;Indian;Kannada;Cinema;News;DirectorWed, 23 Oct 2024 12:29:02 GMTతెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు.. రాజమౌళి డైర‌క్ష‌న్లో వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియ‌ హీరోగా  ఎదిగిన ప్రభాస్.. అక్కడి నుంచి వెనతిరిగి చూడకుండా భారతీయ సినిమాను శాసించే రాజుల దూసుకుపోతున్నాడు. అందులో భాగంగానే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ పై రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.  ఇప్పటికీ ఈ పాన్ ఇండియా హీరో పలు సినిమాలను కూడా లైన్ లో పెట్టుకున్నాడు.. అందులో భాగంగానే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ మూవీ కూడా ఒకటి.. సందీప్ రెడ్డి మూవీస్ అంటేనే ఎంతో వైల్డ్ గా ఉంటాయి.. ఇప్పుడు ప్రభాస్ తో చేయ‌బోయే సినిమాని కూడా వైల్డ్ కంటెంట్ సినిమాగా తెర్కెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్ర‌క‌ట‌న‌ కూడా రానుంది.
 

అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కొత్త అప్‌డేట్ లేకున్నా ఇందులో పలానా పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నారని మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి చాలా రకాల వార్తలు రోజు ఒక్క‌టి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో లేడీ వీల‌న్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తుందని వార్త‌ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హై వోల్టేజ్ య‌క్షన్ సినిమాగా వస్తున్న స్పిరిట్ సినిమాలో కరీనాకపూర్ నటిస్తుందని వార్తలు వచ్చిన క్రమంలోనే ఆమె ఇప్పుడు ఈ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు మరో ప్రచారం బయటికి వచ్చింది.


అదే విధంగా గతంలో కన్నడ స్టార్ హీరో సినిమాని కూడా ఈమె రిజెక్ట్ చేసినట్టు టాక్‌ నడిచింది. ఇప్పుడు ప్రభాస్ తో నటించడానికి కూడా ఇష్టపడటం లేదనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. ‘స్పిరిట్’ మూవీ ని రిజెక్ట్ చేసినట్లు వస్తున్న న్యూస్‌పై తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ స్పందించింది . ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నేను ప్రభాస్ స్పిరిట్ మూవీని తిరస్కరించానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు . వాళ్లు ఇప్పటి వరకూ నాతో ఏమీ సంప్రదించలేదు కూడా. ఒకవేళ సౌత్ నుంచి నన్ను మెప్పించే కథతో ఎవరైనా వస్తే కచ్చితంగా నటిస్తాను’ అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బొత్స‌కు ద‌ర్శ‌నాల‌పై చంద్ర‌బాబు ఫైర్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>