MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie-turned-chiranjeevis-career-upside-downf32023fc-9665-43c4-aeab-666f199d9642-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-movie-turned-chiranjeevis-career-upside-downf32023fc-9665-43c4-aeab-666f199d9642-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాల లాభాల వల్ల ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపును సొంతం చేసుకుని వెలుగు వెలిగిన నిర్మాతల సంఖ్య తక్కువేం కాదు. అయితే చిరంజీవి గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు. ఆచార్య, భోళా శంకర్ ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయనే సంగతి తెలిసిందే. chiranjeevi{#}India;Chiranjeevi;Hero;shankar;Blockbuster hit;Cinemaఆచార్య డిజాస్టర్.. నిర్మాతను అలా ఆదుకున్న చిరు మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!ఆచార్య డిజాస్టర్.. నిర్మాతను అలా ఆదుకున్న చిరు మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!chiranjeevi{#}India;Chiranjeevi;Hero;shankar;Blockbuster hit;CinemaWed, 23 Oct 2024 09:36:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాల లాభాల వల్ల ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపును సొంతం చేసుకుని వెలుగు వెలిగిన నిర్మాతల సంఖ్య తక్కువేం కాదు. అయితే చిరంజీవి గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు. ఆచార్య, భోళా శంకర్ ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయనే సంగతి తెలిసిందే.
 
అయితే ఆచార్య సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సైతం సాధించలేదు. చిరంజీవి, చరణ్ కలిసి నటించినా అంచనాలను అందుకునే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది. అయితే ఆచార్య డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్న సమయంలో చిరంజీవి, చరణ్ తమ పారితోషికంలో ఏకంగా 80 శాతం త్యాగం చేయడం గమనార్హం. నిర్మాతను అలా ఆదుకున్న చిరు మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
చిరంజీవి నిర్మాతల కష్టాలు చూస్తూ ఎదిగాడు కాబట్టే సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యాడని దాదాపుగా మూడు దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చిరంజీవి గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు. విశ్వంభర సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి క్రేజ్ పరంగా టాప్ లో ఉండగా అంతకంతకూ ఎదిగి మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా చిరంజీవి భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నో ఈగో.. నో కాంట్రవర్సీ.. కటౌట్ కే వందల కోట్లు.. అది ప్రభాస్ రేంజ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>