MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sai-pallavi3bccd729-4369-43cf-805d-dbeb8ec86e98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sai-pallavi3bccd729-4369-43cf-805d-dbeb8ec86e98-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అచ్చం పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ అందాల భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో జోరు అందుకుంటుంది. మలయాళ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. అనంతరం వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తోంది. sai pallavi{#}bhama;December;Hanu Raghavapudi;Sai Pallavi;Telugu;producer;Producer;Heroine;Hero;Chitram;Cinema;bollywoodసాయిపల్లవి: రియల్ లేడీ పవన్ స్టార్...బ్లాంక్ చెక్ ఇచ్చినా నో చెప్పింది ?సాయిపల్లవి: రియల్ లేడీ పవన్ స్టార్...బ్లాంక్ చెక్ ఇచ్చినా నో చెప్పింది ?sai pallavi{#}bhama;December;Hanu Raghavapudi;Sai Pallavi;Telugu;producer;Producer;Heroine;Hero;Chitram;Cinema;bollywoodWed, 23 Oct 2024 11:21:00 GMTస్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అచ్చం పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ అందాల భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో జోరు అందుకుంటుంది. మలయాళ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. అనంతరం వరుసగా తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తోంది.


తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఇటీవల కాలంలో సాయి పల్లవి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లోను సాయి పల్లవి సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.... సాయి పల్లవి నటించిన తాజా చిత్రం పడి పడి లేచే మనసు.


హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ తో కలిసి నటించిన ఈ సినిమా 2018 డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిర్మాతల విషయంలో సాయి పల్లవి తన మంచి మనసును చాటుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత సాయి పల్లవికి సగానికి పైగా రెమ్యూనరేషన్ చెల్లించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన రెమ్యూనరేషన్ సాయి పల్లవి వారి వద్ద నుంచి తీసుకోలేదట. సాయి పల్లవికి నిర్మాత ఇంకా 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉందట.


కానీ ఈ చిత్రం కాస్త నిరాశ పరచడంతో సాయి పల్లవికి వారు రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ సాయి పల్లవి మాత్రం అసలు తీసుకోకుండా తన మంచి మనసును చాటుకుంది. ఈ సమయంలో ఈ డబ్బు మీకు చాలా అవసరం ఉంటుంది. నాకు వద్దు అని చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ కావడంతో సాయి పల్లవి అభిమానులు సంబర పడుతున్నారు. అంతేకాకుండా సాయి పల్లవి దేవత అంటూ కామెంట్లు చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>