PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-f50894b5-c364-48fc-81c4-636725c71b75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-f50894b5-c364-48fc-81c4-636725c71b75-415x250-IndiaHerald.jpgకావాలని చేసుకుంటున్నారో.. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన విధానమో కానీ.. సొంత పార్టీ నేతలు సైతం పార్టీకి దూరమయ్యే పరిస్థితి. ఎప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జీవో 29 పై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఈ పని చేయలేదు. తాజాగా మంత్రులు, జర్నలిస్టుల కొరియా పర్యటన పైన ఆయన విమర్శలు చేశారు. Revanth {#}jeevan;revanth;Korea; South;Jeevan Reddy;MP;Jagtial;Telangana Chief Minister;Telangana;Congress;Government;Assembly;Reddy;Minister;Murder.;Party;policeరేవంత్ త‌డ‌బాటు... తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్ద‌రు ఎమ్మెల్సీలు షాక్‌..!రేవంత్ త‌డ‌బాటు... తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్ద‌రు ఎమ్మెల్సీలు షాక్‌..!Revanth {#}jeevan;revanth;Korea; South;Jeevan Reddy;MP;Jagtial;Telangana Chief Minister;Telangana;Congress;Government;Assembly;Reddy;Minister;Murder.;Party;policeWed, 23 Oct 2024 12:56:22 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏది కలిసి రావటం లేదు, పదేళ్ల తర్వాత ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చింది. కావాలని చేసుకుంటున్నారో.. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన విధానమో కానీ.. సొంత పార్టీ నేతలు సైతం పార్టీకి దూరమయ్యే పరిస్థితి. ఎప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జీవో 29 పై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఈ పని చేయలేదు. తాజాగా మంత్రులు, జర్నలిస్టుల కొరియా పర్యటన పైన ఆయన విమర్శలు చేశారు.


దీనిని బట్టి మల్లన్న ప్రభుత్వం పైనే రగిలిపోతున్నార‌ని అర్థమవుతుంది. తాజాగా జగిత్యాలకు చెందిన పార్టీ సీనియ‌ర్ న‌తే... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీకు దండం.. మీ పార్టీ కో దండం అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు నేరుగా చెప్పేశారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి అనుచరుడి హత్య జరిగింది. ఇది పాత కక్ష‌లవల్ల జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కానీ.. తనను బలహీనం చేసేందుకు కాంగ్రెస్‌కు చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నారని జీవన్ రెడ్డి అంటున్నారు. మమ్మల్ని బతకనీయరా.. అని ఆయన మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తన సీనియార్టీని గుర్తించి మంత్రి పదవి ఇస్తారని.. జీవన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.


పైగా ఆయనపై గెలుస్తూ వస్తున్న సంజయ్ కుమార్‌ను రాత్రికి రాత్రి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో 40 ఏళ్ల పాటు జగిత్యాల కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న జీవన్ రెడ్డికి ఇప్పుడు ఇవ‌ని ఇబ్బంది అయ్యాయి. ఎంపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఇప్పుడు అసలు పార్టీలో పట్టించుకునే వారే లేరు. ఈ కోపం అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పరోక్షంగా తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి పార్టీలో పట్టుచీకటం లేదు. చాలామంది రేవంత్ రెడ్డిని లెక్క చేయటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో.. కాంగ్రెస్ పరిస్థితి ఎన్నికలకు నాలుగు ఏళ్ళ ముందే దిగజారుతున్నట్టు అనుకోవాలి.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ బర్త డే స్పెషల్: అప్పటి వరకు ఓ హీరో మాత్రమే.. కానీ, ఆ రోజు నుండే దేవుడిగా మారడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>