MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/stree-impacts-rebel-star86bf4f6a-59a8-45ef-8f76-4b8589d5eb81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/stree-impacts-rebel-star86bf4f6a-59a8-45ef-8f76-4b8589d5eb81-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రేక్షకులకు కొత్తగా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ప్రభాస్ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ గా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవుతున్నారు. తన డైలాగ్ డెలివరీతో సైతం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తూ ఉండటం గమనార్హం. prabhas{#}Horror;Chatrapathi;Mr Perfect;Eshwar;vijay kumar naidu;Blockbuster hit;Fidaa;Darling;Indian;Varsham;Industry;Bahubali;Prabhas;Mass;Hero;Audience;Rajamouli;media;Cinema;bollywoodప్రభాస్ గురించి ఈ 23 విషయాలు తెలుసా.. పేరులోనూ గుణంలోనూ ప్రభాస్ రాజంటూ!ప్రభాస్ గురించి ఈ 23 విషయాలు తెలుసా.. పేరులోనూ గుణంలోనూ ప్రభాస్ రాజంటూ!prabhas{#}Horror;Chatrapathi;Mr Perfect;Eshwar;vijay kumar naidu;Blockbuster hit;Fidaa;Darling;Indian;Varsham;Industry;Bahubali;Prabhas;Mass;Hero;Audience;Rajamouli;media;Cinema;bollywoodWed, 23 Oct 2024 11:10:00 GMTస్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రేక్షకులకు కొత్తగా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ప్రభాస్ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బ్రాండ్ గా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవుతున్నారు. తన డైలాగ్ డెలివరీతో సైతం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తూ ఉండటం గమనార్హం.
 
ఈ జానర్ ఆ జానర్ అనే తేడాల్లేకుండా అన్ని జానర్ల సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ భారీ విజయాలను ఖాతాలో వేసుకోవడంతో పాటు తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. ప్రభాస్ కు సంబంధించిన 23 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ కెరీర్ మొదలైంది. వర్షం సినిమా ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
 
ఛత్రపతి సినిమాతో ప్రభాస్ కు స్టార్ డమ్ దక్కింది. బిల్లా సినిమాలో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించి మెప్పించారు. డార్లింగ్ మూవీతో ప్రభాస్ యూత్ ను ఆకట్టుకున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకుల మెప్పు పొందిన ప్రభాస్ మిర్చి సినిమాతో క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరించారు. బాహుబలి సిరీస్ కు ప్రభాస్ ఏకంగా నాలుగున్నరేళ్ల సమయం కేటాయించి ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు.
 
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు అందుకున్న తొలి భారతీయ మూవీ బాహుబలి2 కాగా యాక్షన్ జాక్షన్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన ప్రభాస్ దేనికైనా రెడీ మూవీ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. పెదనాన్న కృష్ణంరాజుతో బిల్లా, రెబల్ సినిమాలలో ప్రభాస్ నటించారు. రాధేశ్యామ్ సినిమాలో సైతం కృష్ణంరాజు అతిథి పాత్రలో మెరిశారు. త్రిషతో మూడు సినిమాలలో, అనుష్కతో నాలుగు సినిమాలలో ప్రభాస్ నటించారు.
 
రాజమౌళి డైరెక్షన్ లో మూడు సినిమాల్లో, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రెండు సినిమాల్లో ప్రభాస్ నటించడం గమనార్హం. ప్రభాస్ నటించిన బాహుబలి2, కల్కి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ రోల్ లో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తొలి హర్రర్ మూవీ ది రాజాసాబ్ కాగా ప్రభాస్ రాబోయే రోజుల్లో సలార్2, కల్కి2 సినిమాల్లో నటించనున్నారు.
 
కల్కిలో కర్ణుడి రోల్ లో నటించిన ప్రభాస్, కన్నప్ప సినిమాలో నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇతిహాస గాథలో ప్రభాస్ నటించిన మూవీ ఆదిపురుష్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎక్కువగా పిలిచే డార్లింగ్ అనే పదంతో డార్లింగ్ సినిమా తెరకెక్కింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రభాస్ మూవీ బాహుబలి2 కాగా బుజ్జి అండ్ భైరవ అనే యానిమేషన్ వెబ్ సిరీస్ లో ప్రభాస్ నటించారు. మిర్చి, బాహుబలి2 సినిమాలకు ప్రభాస్ అవార్డులను గెలుచుకున్నారు.పేరులోనూ గుణంలోనూ ప్రభాస్ రాజేనని ప్రభాస్ కు మరెవరూ సాటిరారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>