MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-ss-rajamouli-being-blackmailed21618723-35b6-456c-b357-604f3119d5d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-ss-rajamouli-being-blackmailed21618723-35b6-456c-b357-604f3119d5d4-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ రాజమౌళి నోటి వెంట మహేష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వినాలని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయంలో రాజమౌళి నోటి వెంట ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ ను మించేలా మహేష్ మూవీ ఉండనుందని రాజమౌళి వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. mahesh {#}Amazon;Hollywood;Yevaru;Event;RRR Movie;Rajamouli;Industry;Director;News;Cinema;Audience;media;Heroineఆర్ఆర్ఆర్ ను మించేలా మహేష్ మూవీ.. జక్కన్న అప్డేట్ తో ఫ్యాన్స్ కు పండగే!ఆర్ఆర్ఆర్ ను మించేలా మహేష్ మూవీ.. జక్కన్న అప్డేట్ తో ఫ్యాన్స్ కు పండగే!mahesh {#}Amazon;Hollywood;Yevaru;Event;RRR Movie;Rajamouli;Industry;Director;News;Cinema;Audience;media;HeroineTue, 22 Oct 2024 18:06:00 GMTస్టార్ డైరెక్టర్ రాజమౌళి నోటి వెంట మహేష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వినాలని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయంలో రాజమౌళి నోటి వెంట ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ ను మించేలా మహేష్ మూవీ ఉండనుందని రాజమౌళి వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
తాజాగా రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ కు హాజరు కాగా ఈ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాకు జంతువులంటే ఇష్టమని జక్కన్న కామెంట్లు చేశారు. ఆర్.ఆర్.ఆర్ తో పాటు గతంలో నేను తీసిన సినిమాలలో సైతం జంతువులను ఉపయోగించానని అయితే ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని ఆర్.ఆర్.ఆర్ మూవీ కంటే ఎక్కువ జంతువులు నా తదుపరి సినిమాలలో ఉంటాయని రాజమౌళి తెలిపారు.
 
రాజమౌళి ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా కోసం జక్కన్న ఏఐ సహాయంకూడా తీసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ సంస్థ ఏ స్టూడియోతో కలిసి జక్కన్నసినిమా కోసం పని చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి. రాజమౌళి సినిమాల కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.


 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిత్య మీనన్ పెళ్లి ఫిక్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>