MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagarjuna69337a21-be4f-4354-8f1d-98d38e5f47cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-nagarjuna69337a21-be4f-4354-8f1d-98d38e5f47cc-415x250-IndiaHerald.jpgబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి భారీగా వర్షాలు కురవడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధిక వరద పోటెత్తడంతో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. దీంతో అనంతపురంలోని పండమెరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. akkineni nagarjuna{#}surekha vani;Ananthapuram;Shamshabad;Raptadu;Puttaparthi;court;kalyan;monday;Hero;tuesday;Akkineni Nagarjuna;News;Tollywoodఅక్కినేని నాగార్జునకు తప్పిన భారీ ప్రమాదం ?అక్కినేని నాగార్జునకు తప్పిన భారీ ప్రమాదం ?akkineni nagarjuna{#}surekha vani;Ananthapuram;Shamshabad;Raptadu;Puttaparthi;court;kalyan;monday;Hero;tuesday;Akkineni Nagarjuna;News;TollywoodTue, 22 Oct 2024 16:15:00 GMTబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి భారీగా వర్షాలు కురవడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధిక వరద పోటెత్తడంతో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. దీంతో అనంతపురంలోని పండమెరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే అనంతపురం గ్రామీణ పరిధిలోని కళాకారుల కాలనీ, అంబేద్కర్ కాలనీ ఉప్పరపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలో నీటిమయం అయ్యాయి. దీంతో అక్కడి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐదు అడుగుల మేర వరద వచ్చి చేరడంతో ప్రజలు బయటకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉండగా.... టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అనంతపురం వరదల్లో చిక్కుకుపోయారు. ఇవాళ మంగళవారం అక్టోబర్ 22న నాగార్జున వరదల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.... ప్రముఖ కళ్యాణ్ జువెలర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి నాగార్జున అనంతపురం బయలుదేరి అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు నాగార్జున చేరుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడి నిర్వాహకులు నాగార్జునను మరో మార్గంలో అనంతపురంకి క్షేమంగా చేర్చారు.

ఆ తర్వాత నాగార్జున నగల దుకాణాన్ని ప్రారంభించారు. నాగార్జునను చూడడానికి అభిమానులు వందలాది సంఖ్యలో తరలి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కొన్నేళ్ల నుంచి నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.....కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వాక్యాల నేపథ్యంలో నాగార్జున కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ తో బోయపాటి.. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ తగలడి పోతుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>