PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganfa13457f-3ce3-4a26-ad46-ad5153d4c003-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jaganfa13457f-3ce3-4a26-ad46-ad5153d4c003-415x250-IndiaHerald.jpgఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, మాజీ సీఎంగా ఉన్న జగన్ కు కూడా ఒకే తరహా సమస్య వెంటాడుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా.. ఈ సమస్య కామన్ గా ఉండటం గమనార్హం. వారు తరచి చూసుకున్నా.. లేకపోయినా.. పరిశీలకులు చెబుతున్నది మాత్రం ఇద్దరూ కామన్ సమస్యనే ఫేస్ చేస్తున్నారని! అదే.. 'రెడ్డి' డామినేషన్. సాధారణంగా.. జగన్ సామాజిక వర్గం రెడ్డికాబట్టి.. ఆ సామాజిక వర్గం వారు.. అధికారం లో ఉన్నప్పుడు రెచ్చిపోయారు. ఇసుక నుంచి మద్యం వరకు అనేక మంది కీలకరెడ్డి నాయకులపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులను వేలు కూడjagan{#}Kamma;Dookudu;Cheque;Nijam;TDP;YCP;Yevaru;CBN;Party;Jagan;Reddyఆ విషయంలో జగన్ మాదిరి ఇబ్బంది పడుతున్న చంద్రబాబు?ఆ విషయంలో జగన్ మాదిరి ఇబ్బంది పడుతున్న చంద్రబాబు?jagan{#}Kamma;Dookudu;Cheque;Nijam;TDP;YCP;Yevaru;CBN;Party;Jagan;ReddyMon, 21 Oct 2024 09:22:00 GMTఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, మాజీ సీఎంగా ఉన్న జగన్ కు కూడా ఒకే తరహా సమస్య వెంటాడుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా.. ఈ సమస్య కామన్ గా ఉండటం గమనార్హం. వారు తరచి చూసుకున్నా.. లేకపోయినా.. పరిశీలకులు చెబుతున్నది మాత్రం ఇద్దరూ కామన్ సమస్యనే ఫేస్ చేస్తున్నారని! అదే.. 'రెడ్డి' డామినేషన్‌. సాధారణంగా.. జగన్ సామాజిక వర్గం రెడ్డికాబట్టి.. ఆ సామాజిక వర్గం వారు.. అధికారం లో ఉన్నప్పుడు రెచ్చిపోయారు.


ఇసుక నుంచి మద్యం వరకు అనేక మంది కీలకరెడ్డి నాయకులపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులను వేలు కూడా పెట్టనివ్వకుండా అంతా వీళ్లు సొంతం చేసుకు న్నారన్న ఫిర్యాదులు అప్పట్లోనే వచ్చాయి. అంతేకాదు.. పార్టీలతోనూ సంబంధం లేకుండా.. తమకు విశ్వాస పాత్రులైన వారు ఏ పార్టీలో ఉన్నా.. పిలిచి కాంట్రాక్టులు ఇచ్చారు. దీంతో కీలకమైన ఇతర సామాజిక వర్గాలకు పార్టీ దూరమైంది.


కట్ చేస్తే.. ఇప్పుడు కూడా.. రెడ్ల సామ్రాజ్యమే నడుస్తుండడం గమనార్హం. ముఖ్యంగా రాయలసీమలో రెడ్డి నాయకులు.. రెచ్చిపోతున్నారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. కమ్మ సామాజిక వర్గా నికి చెందిన నాయకుల హవా ఎక్కువగా ఉంటుందని అంటారు. కానీ, ఎందుకో.. ఇప్పుడు వారు వెనక్కి తగ్గడంతో పాటు చంద్రబాబు కనుసన్నల్లో ఉంటున్నారు. కానీ, రెడ్డినేతలు మాత్రం రెచ్చిపోతున్నారనేది పార్టీలో చర్చనీయాంశం అయింది.


ఈ విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. రెడ్డి నేతలను కంట్రోల్ చేస్తున్నట్టు చెబుతున్నా.. వారి దూకుడు ఉంటేనే వైసీపీ రెడ్డి నాయకులకు బ్రేకులు పడతాయన్నది పార్టీలో సీనియ ర్లు చెబుతున్న మాట. ''ఎవరో ఒకరు దూకుడుగా ఉండాలి. అందరూ మెత్తగా ఉంటే ఎలా? '' అని తాజాగా పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన నవ్వుతూ అన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం నిజం ఇదేనన్నది అందరికీ తెలిసిందే. సో.. ప్రాబ్లం ఉన్నా.. వైసీపీకి చెక్ పెట్టాలంటే.. ఆ మాత్రం దూకుడు ఉండాలన్నట్టుగా టీడీపీ ఉంది. మరి ఇది మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ, ఏం జరుగుతుందో చూడాలి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున: అదరహో అనిపించిన హలో బ్రదర్.. డబల్ యాక్షన్ లో కూడా దబిడి దిబిడే.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>