MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ హీరోగా సెటిల్ అవ్వలేకపోతున్నాడు అన్న టెన్షన్ నాగార్జునకు లోలోపల ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. అక్కినేని కుటుంబ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి భారీ నిర్మాణ సంస్థ సపోర్ట్ ఉన్నప్పటికీ అఖిల్ చేస్తున్న రకరకాల ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది‘ఏజెంట్’ సినిమా కోసం రెండు సంవత్సరాలు అఖిల్ కష్టపడినప్పటికీ ఆకష్టానికి తగ్గ ఫలితాన్ని ‘ఏజెంట్’ ఏమాత్రం ఇవ్వలేకపొంది. దీనితో ఈ అక్కినేని యంగ్ nagarjuna{#}akhil akkineni;annapurna;bollywood;Director;Darsakudu;Hero;News;Cinemaఅఖిల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన నాగార్జున !అఖిల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన నాగార్జున !nagarjuna{#}akhil akkineni;annapurna;bollywood;Director;Darsakudu;Hero;News;CinemaMon, 21 Oct 2024 14:26:00 GMT

అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ హీరోగా సెటిల్ అవ్వలేకపోతున్నాడు అన్న టెన్షన్ నాగార్జునకు లోలోపల ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. అక్కినేని కుటుంబ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి భారీ నిర్మాణ సంస్థ సపోర్ట్ ఉన్నప్పటికీ అఖిల్ చేస్తున్న రకరకాల ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


‘ఏజెంట్’ సినిమా కోసం రెండు సంవత్సరాలు అఖిల్ కష్టపడినప్పటికీ ఆకష్టానికి తగ్గ ఫలితాన్ని ‘ఏజెంట్’ ఏమాత్రం ఇవ్వలేకపొంది. దీనితో ఈ అక్కినేని యంగ్ హీరో తాను చేయబోయే సినిమాల విషయంలో తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. దీనితో అఖిల్ అభిమానులు అతడి తదుపరి సినిమా ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు వార్తలు వస్తున్నాయి.


కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అన్న మూవీని చేసిన మురళీ కిషోర్ చెప్పిన ఒక కథ నాగార్జునకు బాగా నచ్చడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగ్ స్వయంగా నిర్మిస్తాడు అని అంటున్నారు. ఒక పీరియాడిక్ డ్రామా గా ఈ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.


భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది అని అంటున్నారు. ఈ మూవీలో అఖిల్ పక్కన ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసే విషయంలో చర్చలు జరుగుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆమధ్య దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన ఒక కథ అఖిల్ కు నచ్చడంతో ఆమూవీ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు అఖిల్ పూరీని పక్కకు పెట్టి ఒక యంగ్ డైరెక్టర్ తో ముందుకు వెళుతున్నాడు అనుకోవాలి. ఈ ప్రయోగం అయినా సక్సస్ అయితే అఖిల్ కెరియర్ సెటిల్ అయ్యే ఆస్కారం ఉంది..












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సీనియర్ హీరోయిన్ రోజా.. ఆ స్టార్ హీరోకు అంత రాడ్ దింపిందిగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>