MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna22394e4f-387b-4581-8072-ffaa6af02175-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna22394e4f-387b-4581-8072-ffaa6af02175-415x250-IndiaHerald.jpgఒక బడా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. తన కొడుకులకు కూడా లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నా ఒక హీరో . ఇలాంటి ఒక స్టార్ స్టేటస్ కి సంబంధించిన చరిత్ర వినపడుతుంది . అయితే నాగార్జున కూడా తన కెరియర్ లో కొన్ని తప్పులు చేశాడు . ఆ తప్పుల కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు . మరీ ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ కూడా ఆయనను హేట్ చేసిన సినిమా అంటే మాత్రం "కృష్ణార్జున" అనే చెప్పాలి . Nagarjuna{#}sekhar;Kartha;vishnu;history;Akkineni Nagarjuna;Hero;Cinema"నీకు దండం పెడతాం సార్.. దయచేసి ఆ పని మాత్రం చేయద్దు".. నాగార్జునకు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!"నీకు దండం పెడతాం సార్.. దయచేసి ఆ పని మాత్రం చేయద్దు".. నాగార్జునకు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!Nagarjuna{#}sekhar;Kartha;vishnu;history;Akkineni Nagarjuna;Hero;CinemaMon, 21 Oct 2024 11:21:00 GMTనాగార్జున అంటే ఒక స్టార్ హీరో ..ఒక బడా హీరో కొడుకు ..ఒక బడా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. తన కొడుకులకు కూడా లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నా ఒక హీరో . ఇలాంటి ఒక స్టార్ స్టేటస్ కి సంబంధించిన చరిత్ర వినపడుతుంది . అయితే నాగార్జున కూడా తన కెరియర్ లో కొన్ని తప్పులు చేశాడు . ఆ తప్పుల కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు . మరీ ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ కూడా ఆయనను హేట్ చేసిన సినిమా అంటే మాత్రం "కృష్ణార్జున" అనే చెప్పాలి .


మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన దేవుడు పాత్రలో మెప్పిస్తాడు . అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున ఫ్యాన్స్ ఆయనపై మండిపడ్డారు . అంత పెద్ద హీరోవి అలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నావ్? అసలు నీకు ఆ సినిమాలో వాల్యూనే లేదు అంటూ చాలా చాలా కోపడ్డారు . ఒకానొక సందర్భంలో అక్కినేని ఫ్యాన్స్ ఆ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా మాట్లాడారు . అయితే నాగార్జున మాత్రం ఆ తర్వాత అలాంటి భారీ రిస్క్ చేయనే చేయలేదు. ఏ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించలేదు .



అంతేకాదు "కృష్ణార్జున" సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే . అసలు నాగార్జున ఈ సినిమాలో ఉన్నాడు ..ఆయన క్యారెక్టర్ ఉంది అని చాలామంది జనాలకు తెలియదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అక్కినేని నాగార్జునను చాలా చాలా వేడుకున్నారు . "మీకు దండం పెడతాము.. మీరు  మాత్రం ఇక ఇలాంటి గెస్ట్ రోల్స్ చేయొద్దు.. అది కూడా ఇలాంటి మీకు వాల్యూ లేని కంటెంట్ ఉన్న సినిమాలలో అసలు నటించొద్దు "అంటూ చాలా రిక్వెస్ట్ చేశారు . ఫ్యాన్స్ రిక్వెస్ట్ విన్నాడో ఏమో ఇప్పటివరకు నాగార్జున గెస్ట్ రోల్  చేసింది లేదు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కుబేర" సినిమాలో కీలకపాత్రలో మెరుస్తున్నారు నాగ్. అయితే ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంతా కూడా నాగార్జుననే కావడంతో ఈ పాత్రను ఓకే చేశాడట. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జ‌య‌మాలినిని వాడేసిన ఎన్టీఆర్‌... వ‌ర్జినీటీ కోల్పోయిన జ‌య‌మాలిని...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>