MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgదర్శకుడు అనీల్ రావిపూడికి ‘సంక్రాంతి’ సెంటిమెంట్ ఎక్కువ. ‘ఎఫ్ 2’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు గతంలో సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని వెంకటేష్ కెరియర్ లో 76వ సినిమాగా విడుదలకాబోతున్న ఒక కామెడీ ఎంటర్ టైనర్ చాలా వేగంగా తీస్తున్నాడు. ఈమూవీ వచ్చే సంక్రాంతికి విడుదలకు రెడీ అయ్యే విధంగా అనీల్ పరుగులు తీస్తున్నాడు. మాజీ భార్య మాజీ ప్రేయసీ మాజీ పర్సనల్ సెక్రటరీ ల మధ్య నలిగిపోయే ఒక ధనవంతుడుగా వెంకటేష్ ఈమూవీలో కనిపిస్తాడని లీకులు వస్తున్నాయి. ‘ఎఫ్ 2’ రేంజ్venkatesh{#}Ram Charan Teja;anil ravipudi;Makar Sakranti;Wife;Dil;Comedy;producer;Producer;Venkatesh;Industry;Cinemaఅనీల్ రావిపూడి కి సమస్యగా మారిన గేమ్ ఛేంజర్ !అనీల్ రావిపూడి కి సమస్యగా మారిన గేమ్ ఛేంజర్ !venkatesh{#}Ram Charan Teja;anil ravipudi;Makar Sakranti;Wife;Dil;Comedy;producer;Producer;Venkatesh;Industry;CinemaMon, 21 Oct 2024 15:38:00 GMTదర్శకుడు అనీల్ రావిపూడికి ‘సంక్రాంతి’ సెంటిమెంట్ ఎక్కువ. ‘ఎఫ్ 2’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు గతంలో సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని వెంకటేష్ కెరియర్ లో 76వ సినిమాగా విడుదలకాబోతున్న ఒక కామెడీ ఎంటర్ టైనర్ చాలా వేగంగా తీస్తున్నాడు. ఈమూవీ వచ్చే సంక్రాంతికి విడుదలకు రెడీ అయ్యే విధంగా అనీల్ పరుగులు తీస్తున్నాడు.



మాజీ భార్య మాజీ ప్రేయసీ మాజీ పర్సనల్ సెక్రటరీ ల మధ్య నలిగిపోయే ఒక ధనవంతుడుగా వెంకటేష్ ఈమూవీలో కనిపిస్తాడని లీకులు వస్తున్నాయి. ‘ఎఫ్ 2’ రేంజ్ కి మించిన కామెడీ ఈమూవీలో ఉంటుందని అనీల్ రావిపూడి ఇప్పటికే లీకులు ఇస్తున్నాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాం అంటూ ఆమధ్య పబ్లిసిటీ కూడ మొదలు పెట్టారు. అయితే ఈమూవీ సంక్రాంతి విడుదలకు ‘గేమ్ ఛేంజర్’ సమస్యగా మారవచ్చు అన్నవార్తాలు వస్తున్నాయి.



రామ్ చరణ్ శంకర్ ల కాంబినేషన్ లో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ డిసెంబర్ లో కాకుండా సంక్రాంతికి విడుదల అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈమూవీకి దిల్ రాజ్ నిర్మాత అనీల్ రావిపూడి వెంకటేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి కూడ దిల్ రాజ్ నిర్మాత. ‘గేమ్ ఛేంజర్’ కోసం వెంకటేష్ మూవీని పక్కకు నెట్టాలని ఆలోచనలలో పడ్డ దిల్ రాజ్ ఈవిషయంలో వెంకటేష్ ను ఒప్పించి సంక్రాంతి రేస్ నుండి తప్పించే బాధ్యతను అనీల్ రావిపూడికి అప్పచెప్పారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు వస్తున్నాయి.



అయితే గతంలో అనీల్ రావిపూడి వెంకటేష్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’ అదేవిధంగా ‘కలిసి ఉందాం రా’ సినిమాలు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయిన నేపధ్యంలో సంక్రాంతి పండుగను వదులుకోవాలని వెంకటేష్ కు ఇష్టంలేక పోవడంతో ఈవిషయం పై వెంకీ ని ఎలా ఒప్పించాలో తెలియకా అనీల్ రావిపూడి తికమక పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మొట్ట మొదటి సారి బ్యానర్ మార్చిన దుల్కర్.. అలాంటి మ్యాజిక్ మళ్ళీ జరిగేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>