EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababube35c7fe-8abb-47d0-a707-29441acff307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababube35c7fe-8abb-47d0-a707-29441acff307-415x250-IndiaHerald.jpgవృద్ధాప్య జనాభాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ ఆసక్తికర పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులని చట్టం రావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అవును... దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువ మమంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా... ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి కొత్త చట్టాన్ని పరిగణలోకి తీసుకొవడంతోపాటు..chandrababu{#}CBN;Andhra Pradesh;Government;local language;Population;Ministerదక్షిణాది రాష్ట్రాల బాగు కోసం కొత్త పిలుపునిచ్చిన చంద్రబాబు? వర్కౌట్ అవుతుంది అంటారా?దక్షిణాది రాష్ట్రాల బాగు కోసం కొత్త పిలుపునిచ్చిన చంద్రబాబు? వర్కౌట్ అవుతుంది అంటారా?chandrababu{#}CBN;Andhra Pradesh;Government;local language;Population;MinisterMon, 21 Oct 2024 14:46:00 GMTవృద్ధాప్య జనాభాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఓ ఆసక్తికర పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులని చట్టం రావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.


అవును... దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువ మమంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా... ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించడానికి కొత్త చట్టాన్ని పరిగణలోకి తీసుకొవడంతోపాటు.. జనాభా నిర్వహణను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.


ఇదే సమయంలో... ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని గతంలో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... ఆంధ్రాతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధాప్య సమస్య సంకేతాలు కనిపించడం ప్రారంభించాయని.. జపాన్, చైనా వంటి అనేక దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఈ సమస్యతో పోరాడుతున్నాయని.. ఆయా దేశాల్లో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు! దక్షిణాదిలో యువత విదేశాలకు వలస వెళ్లడం వల్ల సమస్య జటిలమైందని అన్నారు.


ఈ నేపథ్యంలో... జనాభా నియంత్రణపై తన గత వైఖరిని అంగీకరించిన బాబు... ఒకప్పుడు జనాభా నియంత్రణ పాటించాలని చెప్పిన తానే, ఇప్పుడు జనాభా పెంచాలన్న నినాదాన్ని ఉద్యమంగా తీసుకున్నట్లు చెప్పారు. జనాభా పెరుగుదలను తగ్గించడంలో తాము విజయం సాధించామని.. అయితే ఇప్పుడు అది కొత్త సాళ్లను తెచ్చిపెట్టిందని అన్నారు.  మరి  ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నూతన ఫార్ములా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీ నుండి ఆ హీరోయిన్ను తీసేయాలన్న ప్రొడ్యూసర్.. ఒక్క మాటతో అంతా మార్చేసిన పవన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>