MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-flop-for-krithi-shetty-in-telugu55dcc15a-6bc8-4a7e-b6ae-543bc554415f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-flop-for-krithi-shetty-in-telugu55dcc15a-6bc8-4a7e-b6ae-543bc554415f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. అతితక్కువ సమయంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ వంటి అనేక సినిమాలలో నటించి వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంది. krithi shetty{#}anudeep kv;Macherla;shyam;Girl;Smart phone;pradeep;BEAUTY;Hero;Tollywood;Jayam;Telugu;Cinema;Successకృతిశెట్టికి అర్థరాత్రి ఫోన్లు చేస్తున్న హీరో ?కృతిశెట్టికి అర్థరాత్రి ఫోన్లు చేస్తున్న హీరో ?krithi shetty{#}anudeep kv;Macherla;shyam;Girl;Smart phone;pradeep;BEAUTY;Hero;Tollywood;Jayam;Telugu;Cinema;SuccessMon, 21 Oct 2024 22:39:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీసినిమా అనంతరం సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది. అతితక్కువ సమయంలోనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ వంటి అనేక సినిమాలలో నటించి వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంది.


ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో తెలుగు సినిమాలు ఏమి లేకపోవడం బాధాకరం. మొన్న ఆ మధ్యకాలంలో శర్వానంద్ తో కలిసి మనమే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. అయితే తెలుగులో ఎలాంటి ఆఫర్స్ రాకపోయినా తమిళంలో కృతి శెట్టి జోరు బాగానే ఉంది. పైగా మలయాళంలో నటించిన మొదటి సినిమా అజయంతే రాండం మోషణం సినిమా బాగానే ఆడింది. తమిళంలోనూ కార్తీ, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ వంటి హీరోలతో ఈ బ్యూటీ నటిస్తోంది. తెలుగులోనూ కృతి శెట్టికి ఈ మధ్యనే ఓ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.


విశ్వక్సేన్ హీరోగా, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ వచ్చినట్టే. మరోవైపు సోషల్ మీడియాలో కృతి శెట్టి జోరుగా అందాల ఆరబోత చేస్తోంది. అదే కృతి శక్తికి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తన అందాల ఆరబోతకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.


ఇదిలా ఉండగా....కృతి శెట్టికి ఓ స్టార్ హీరో అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడట. చాలా రోజుల నుంచి ఇలానే వరుసగా కృతి శెట్టికి ఫోన్ చేయడం, తనను విసిగించడం చేస్తున్నారట. ఈ విషయాన్ని కృతి శెట్టి తన స్నేహితులతో చెప్పుకొని బాధపడిందట. ఈ విషయాన్ని స్వయంగా కృతి శెట్టి సన్నిహితులు తెలియజేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కృతిశెట్టికి అర్థరాత్రి ఫోన్లు చేస్తున్న హీరో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>