Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss2f7d6585-6784-43f3-9b03-634831b997d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss2f7d6585-6784-43f3-9b03-634831b997d7-415x250-IndiaHerald.jpgతాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. మొదట్లో మణికంఠ ఎవరైనా నామినేట్‌ అయితే చాలు, తెగ టెన్షన్‌ పడేవాడు. తను అలా నామినేట్ కాకూడదని కోరుకొనే వాడు. హౌస్‌లోనే కొనసాగాలని తపించిపోయాడు. కానీ ఈ వారం అయితే సీన్‌ రివర్స్ అయింది. మణికంఠ కోరి తనని తానే బిగ్‌బాస్‌ హౌస్ లో నుండి బయటకి పంపేయమని హోస్ట్ నాగార్జునని వేడుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఓ తరుణంలో అయితే ఈ షో నాకు చాలా ముఖ్యం. నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర తనకి తగిన గౌరవం దక్కాలన్నా ఈ షో bigg boss{#}Athadu;gowtam;Bigboss;naga;Audience;Akkineni Nagarjuna;Houseబిగ్ బాస్ హిస్టరీ లోనే తక్కువ రెమ్యూనరేషన్.. మణికంఠకు ఎంత ఇచ్చారంటే?బిగ్ బాస్ హిస్టరీ లోనే తక్కువ రెమ్యూనరేషన్.. మణికంఠకు ఎంత ఇచ్చారంటే?bigg boss{#}Athadu;gowtam;Bigboss;naga;Audience;Akkineni Nagarjuna;HouseMon, 21 Oct 2024 13:10:00 GMTతాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. మొదట్లో మణికంఠ ఎవరైనా నామినేట్‌ అయితే చాలు, తెగ టెన్షన్‌ పడేవాడు. తను అలా నామినేట్ కాకూడదని కోరుకొనే వాడు. హౌస్‌లోనే కొనసాగాలని తపించిపోయాడు. కానీ ఈ వారం అయితే సీన్‌ రివర్స్ అయింది. మణికంఠ కోరి తనని తానే బిగ్‌బాస్‌ హౌస్ లో నుండి బయటకి పంపేయమని హోస్ట్ నాగార్జునని వేడుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఓ తరుణంలో అయితే ఈ షో నాకు చాలా ముఖ్యం. నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర తనకి తగిన గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి! అని నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి విదితమే.

కట్ చేస్తే, తాజాగా హౌస్‌లో నేను ఉండలేను. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శరీరం సహకరించడం లేదు.. ఇక నా వల్ల కాదు ఈ ఆటలు! నన్ను తొందరగా ఎలిమినేట్ చేసేయండి! అని చెప్పడంతో అతడు కోరుకున్నట్లుగానే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడి పారితోషికం ఎంత? అనే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అసలు విషయంలోకి వెళితే, మణికంఠ వారానికి రూ.1.20 లక్షల చొప్పున సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం.

కాగా మణికంఠ ఎలిమినేషన్ అనేది ఒకవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో, మరోవైపు బిగ్ బాస్ కంటిస్టెంట్లలో కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రేక్షకులు ఇష్టపడి ఓటు వేసినా, హోస్ట్ నాగార్జున హెచ్చరించినా, కూడా నాగ మణికంఠ ఇక నేను ఇంట్లో ఉండలేను అంటూ ఎలిమినేట్‌ అయ్యి, అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. కాగా ఈ వారం నామినేషన్స్‌లో మణికంఠ, గౌతమ్‌లు చివరి వరకూ నిలిచిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో నాగార్జున ఇంటి నుంచి బయటకి వెళ్లిపోవాలనుకున్న మణికంఠ నిర్ణయంపై మరోసారి సమీక్షించుకోవాల్సిందిగా అవకాశం ఇవ్వగా మణికంఠ దానిని వాడుకొనే స్థితిలో లేదు. అప్పటికే మణికంఠ చాలా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసాడు. దాంతో వెనక్కి తగ్గలేదు. బేసిగ్గా ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉంది. కానీ మణికంఠ తనని తాను ఎలిమినేట్‌ చేయమని కోరడంతో అది కాస్త గౌతమ్‌ కి చాలా ప్లస్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖిల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగిన నాగార్జున !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>