MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr4502e97f-d3af-488c-9490-8adeb92ba2f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr4502e97f-d3af-488c-9490-8adeb92ba2f7-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలను మరొకరు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది తమ దగ్గరకు వచ్చిన స్టోరీలను ఆ కథ నచ్చక రిజక్ట్ చేస్తే , మరి కొంత మంది ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో సినిమా కథ అద్భుతంగా నచ్చిన అవి మా స్థాయికి సరిపోవు. అలాంటి సినిమాలు మేము చేయడం వల్ల ఆ కథ పాడైపోతుంది. అనవసరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ హీరోలు కొన్ని కథలను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాJr ntr{#}Bommarillu;Siddharth;Industry;Box office;Heroine;Jr NTR;Tollywood;Mass;Cinema;Audienceబ్లాక్ బస్టర్ అని తెలిసిన ఆ సినిమాను రిజెక్ట్ చేసిన తారక్.. చివరకు రిజల్ట్ మాత్రం అలా..?బ్లాక్ బస్టర్ అని తెలిసిన ఆ సినిమాను రిజెక్ట్ చేసిన తారక్.. చివరకు రిజల్ట్ మాత్రం అలా..?Jr ntr{#}Bommarillu;Siddharth;Industry;Box office;Heroine;Jr NTR;Tollywood;Mass;Cinema;AudienceMon, 21 Oct 2024 18:10:00 GMTసినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలను మరొకరు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది తమ దగ్గరకు వచ్చిన స్టోరీలను ఆ కథ నచ్చక రిజక్ట్ చేస్తే , మరి కొంత మంది ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో సినిమా కథ అద్భుతంగా నచ్చిన అవి మా స్థాయికి సరిపోవు. అలాంటి సినిమాలు మేము చేయడం వల్ల ఆ కథ పాడైపోతుంది. అనవసరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ హీరోలు కొన్ని కథలను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మూవీ కథ అద్భుతంగా నచ్చిన కూడా ఆ సినిమా తనపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో వదిలేసాడట. ఆ సినిమా ఏది..? ఆ వివరాలు ఏమిటి తెలుసుకుందాం. కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ... సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు సినిమా కథను మొదట నాకే చెప్పారు. ఆ సినిమా కథ నాకు అద్భుతంగా నచ్చింది. కానీ ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు , మాస్ డైలాగులు లేవు.

అలాంటి కథ నాపై రూపొందిస్తే పెద్దగా వర్కౌట్ కాదు. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులు అంతా కూడా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగులు ఉండాలి అని అనుకుంటారు. అలాంటి అంచనాలతో థియేటర్కి వచ్చిన వారికి అవేమీ లేకపోతే ఆ సినిమా వారికి నచ్చదు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా ఆ కథతో రూపొందే సినిమా ఫ్లాప్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ సినిమాను రిజెక్ట్ చేశాను అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే బొమ్మరిల్లు సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీ నుండి ఆ హీరోయిన్ను తీసేయాలన్న ప్రొడ్యూసర్.. ఒక్క మాటతో అంతా మార్చేసిన పవన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>