MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/huge-fan-base-in-japan-over-prabhas-a52a02c4-d488-44a8-b753-c1464964a57e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/huge-fan-base-in-japan-over-prabhas-a52a02c4-d488-44a8-b753-c1464964a57e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ ఫేజ్ నడుస్తోంది. ఈ టాప్ హీరో అక్టోబర్ 23వ తేదీన పుట్టినరోజు జరుపుకొనున్నారు. ఈ సందర్భంగా వరుస పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అనేక అప్డేట్స్ రానున్నాయి. ఏ స్టార్ హీరోకు జరగని విధంగా ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు ఈ సంవత్సరం రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలో మరేవో కాదు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, రెబల్, సలార్, ఛత్రపతి, ఈశ్వర్. prabhas{#}sandeep;Traffic police;Darling;Mister;Japan;Prabhas;October;Raccha;India;Hero;Cinema;Newsజపాన్‌లో తెలుగు హీరోకు క్రేజ్‌..టాలీవుడ్‌ తలెత్తుకోవాల్సిందే ?జపాన్‌లో తెలుగు హీరోకు క్రేజ్‌..టాలీవుడ్‌ తలెత్తుకోవాల్సిందే ?prabhas{#}sandeep;Traffic police;Darling;Mister;Japan;Prabhas;October;Raccha;India;Hero;Cinema;NewsSun, 20 Oct 2024 15:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ ఫేజ్ నడుస్తోంది. ఈ టాప్ హీరో అక్టోబర్ 23వ తేదీన పుట్టినరోజు జరుపుకొనున్నారు. ఈ సందర్భంగా వరుస పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అనేక అప్డేట్స్ రానున్నాయి. ఏ స్టార్ హీరోకు జరగని విధంగా ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు ఈ సంవత్సరం రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలో మరేవో కాదు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, రెబల్, సలార్, ఛత్రపతి, ఈశ్వర్.


అక్టోబర్ 23న ఉదయం 8 గంటల నుంచి చాలా చోట్ల ఈ సినిమాల షోలు ప్రారంభం కానున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అభిమానులు ఘనంగా చేయబోతున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ఇప్పటినుంచే సోషల్ మీడియాలో డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకు అడ్వాన్స్ గా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక జపాన్ లో మాత్రం డార్లింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జపాన్ లో ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ సినిమాను రిలీజ్ చేసి అడ్వాన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే రాదేశ్యామ్ రీరిలీజ్ సందర్భంగా థియేటర్లలో భారీ సంఖ్యలో అభిమానులు చేరి రచ్చ రచ్చ చేశారు. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు పట్టుకొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


కాగా, సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకుంటున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని చెప్పడంతో ఈ సినిమాపై మరింతగా క్రేజ్ పెరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రబాబు మ్యాజిక్..! మూడు రోజుల్లో మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>