MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9bc5d3a3-119c-4377-b8fa-cc082c46512e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9bc5d3a3-119c-4377-b8fa-cc082c46512e-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో చాలా విజయాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ కెరియర్లో మంచి క్లాస్ మూవీగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా , దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు కొంత కాలం క్రితంPrabhas{#}dil raju;kajal aggarwal;Tapsee Pannu;Sri Venkateshwara Creations;Mr Perfect;Mister;sree;Smart phone;producer;Producer;king;Prabhas;Box office;Cinema;Musicమిస్టర్ పర్ఫెక్ట్ మొదలయ్యే ముందు ఇంత స్టోరీ నడిచిందా.. వద్దనుకుని ప్రభాస్ ఎందుకు చేశాడు..?మిస్టర్ పర్ఫెక్ట్ మొదలయ్యే ముందు ఇంత స్టోరీ నడిచిందా.. వద్దనుకుని ప్రభాస్ ఎందుకు చేశాడు..?Prabhas{#}dil raju;kajal aggarwal;Tapsee Pannu;Sri Venkateshwara Creations;Mr Perfect;Mister;sree;Smart phone;producer;Producer;king;Prabhas;Box office;Cinema;MusicSat, 19 Oct 2024 15:10:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో చాలా విజయాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ కెరియర్లో మంచి క్లాస్ మూవీగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా , దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ స్టార్ట్ కాకముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చాడు. దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... నాకు ఒక రోజు దశరథ్ "మిస్టర్ పర్ఫెక్ట్" మూవీ కి సంబంధించిన కొంత భాగం స్టోరీని వినిపించాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ స్టోరీ ప్రభాస్ తో బాగుంటుంది అని నాకు అనిపించింది. ఆ వెంటనే ప్రభాస్ కి ఫోన్ చేశా. అప్పుడు ఆయన మలేషియాలో ఉన్నాడు. ఇక దశరథ్ తయారు చేసిన స్టోరీ గురించి చెప్పాను. దానిని ఫోన్ లోనే దశరథ్ తో ఆయనకు చెప్పించాను. ఆయన స్టోరీ మొత్తం విన్నాక మొదటి భాగం బాగుంది.. కానీ సెకండాఫ్ బాగోలేదు అన్నాడు. నేను కథ మొత్తం నువ్వు ఇండియాకు వచ్చే సరికి సెట్ చేస్తాను అన్నాను.

ఇక ప్రభాస్ ఇండియా కి వచ్చాక ఒక రోజు ఫోన్ చేసి స్టోరీ మొత్తం రెడీ అయింది అని చెప్పాను. ఇక ఆయన మాత్రం సినిమా చేయొద్దు అనే ఉద్దేశంతో వచ్చాడట. కథ విని నో చెబుదాం అనుకున్నాడట. దశరథ్ చెప్పిన కథ మొత్తం విన్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ అసలు నేను ఈ సినిమా చేయొద్దు అనుకున్నాను. కానీ నువ్వు ఈ సినిమా సెకండాఫ్ ను చాలా బాగా డెవలప్ చేయించావు అందుకే చేస్తున్నాను అని చెప్పాడట. ఇక మిస్టర్ ఫర్ఫెక్ట్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జూనియర్ దర్శకుల ముందు సీనియర్స్ తేలిపోతున్నారా.. ఇప్పటికైనా అది సరి చేసుకుంటారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>