MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/roja6359ba41-c1c2-4357-acec-d045f09f19fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/roja6359ba41-c1c2-4357-acec-d045f09f19fb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే వివాదాస్పద నటి మణులు ఉన్నారు. అలాంటి వారిలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఒకరు. అప్పట్లో రోజా చాలా సినిమాలు హీరోయిన్గా చేసింది. కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పాత్రలు కూడా చేసింది రోజా. అలాంటి వాటిలో బొబ్బిలి సింహం ఒకటి. బొబ్బిలి సింహం సినిమా వచ్చి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా చేయగా మీనా హీరోయిన్గా చేయడం జరిగింది. roja{#}Balakrishna;meena;Roja;Cancer;Nagari;Bobbili;Tollywood;MLA;Cinemaబొబ్బిలి సింహం: బాలకృష్ణకు రియల్‌ విలన్​ ఫైర్​ బ్రాండ్ రోజానే?బొబ్బిలి సింహం: బాలకృష్ణకు రియల్‌ విలన్​ ఫైర్​ బ్రాండ్ రోజానే?roja{#}Balakrishna;meena;Roja;Cancer;Nagari;Bobbili;Tollywood;MLA;CinemaFri, 18 Oct 2024 10:02:00 GMT* బొబ్బిలి సింహం సినిమాకు 30 ఏళ్లు
* బాలయ్య సరసన మెరిసిన రోజా, మీనా
* భిన్నమైన పాత్రలో మెరిసిన ఫైర్ బ్రాండ్ రోజా


టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే వివాదాస్పద నటి మణులు ఉన్నారు. అలాంటి వారిలో  నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఒకరు. అప్పట్లో రోజా చాలా సినిమాలు హీరోయిన్గా చేసింది. కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పాత్రలు కూడా చేసింది రోజా. అలాంటి వాటిలో బొబ్బిలి సింహం ఒకటి. బొబ్బిలి సింహం సినిమా వచ్చి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా చేయగా మీనా హీరోయిన్గా చేయడం జరిగింది.


ఈ సినిమాలో రోజా విలన్ గా కనిపిస్తారు. అంటే కీలకపాత్రలోనే రోజా... మెరిసారన్నమాట. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కంటే ముందు ఆ తర్వాత రోజా అనేక సినిమాలు చేసినప్పటికీ... బొబ్బిలి సింహం ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఆమె నెగిటివ్ రోల్ చేసినప్పటికీ.. అందరి గుండెలు పిండేలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు.


క్యాన్సర్ ఉందని ముందే తెలిసి... బాలయ్యను అలాగే మీనను చాలా ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే బాలయ్య అటు మీనా పెళ్లి చేసుకునేలా కూడా..  ఈ సినిమాలో స్కెచ్ లు వేయడం జరుగుతుంది. కానీ చివరికి.. క్యాన్సర్ విషయం తెలియడంతో.. ఆ సమయంలో రోజా యాక్టింగ్ అందరిని.. ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం తన వైపు లాక్కెళ్ళిపోతుంది రోజా.


ఈ లాస్ట్ సీన్ సమయంలో... అందరూ రోజాను మెచ్చుకుంటారు. ఆమె గొప్ప మనసు అర్థం చేసుకుంటారు.  ఇక ఈ సినిమానే కాకుండా.. తన రీయంట్రీలో.. గోలిమార్ లాంటి సినిమాలు చేసింది రోజా. తల్లి పాత్రలో.. ఓ విలన్ల మెరిసి అందరినీ... ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రలు తన కెరీర్లో చాలానే చేసింది. బాలయ్యతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో... టాప్ మోస్ట్ హీరోల అందరితో.. రోజా సినిమాలు చేయడం జరిగింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ లో మరో రెడ్ కార్డు.. నాగార్జున మరో సంచలన నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>