MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arundath2b357d29-c4f4-450e-b2a7-c4321b1c3c26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/arundath2b357d29-c4f4-450e-b2a7-c4321b1c3c26-415x250-IndiaHerald.jpgప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతున్నా ఒకప్పుడు మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పరిమితంగా తెరకెక్కేవి. భారీ బడ్జెట్లతో హీరోయిన్లతో సినిమాలను నిర్మించడానికి దర్శకనిర్మాతలు సైతం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే అనుష్క ప్రధాన పాత్రలో అరుంధతి సినిమా తెరకెక్కగా అప్పట్లోనే ఈ సినిమాను ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. arundath{#}anoushka;Arundhati;Blockbuster hit;Telugu;Cinemaజేజమ్మ పాత్రకు ప్రాణం పోసిన అనుష్క.. మరొకరిని ఊహించుకోలేముగా!జేజమ్మ పాత్రకు ప్రాణం పోసిన అనుష్క.. మరొకరిని ఊహించుకోలేముగా!arundath{#}anoushka;Arundhati;Blockbuster hit;Telugu;CinemaFri, 18 Oct 2024 09:06:00 GMTప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతున్నా ఒకప్పుడు మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పరిమితంగా తెరకెక్కేవి. భారీ బడ్జెట్లతో హీరోయిన్లతో సినిమాలను నిర్మించడానికి దర్శకనిర్మాతలు సైతం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే అనుష్క ప్రధాన పాత్రలో అరుంధతి సినిమా తెరకెక్కగా అప్పట్లోనే ఈ సినిమాను ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
 
పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలైన అరుంధతి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది. జేజమ్మ పాత్రకు తన అద్భుతమైన నటనతో అనుష్క ప్రాణం పోశారనే చెప్పాలి. యాక్టింగ్ విషయంలో అనుష్కను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. అనుష్కసినిమా కోసం పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు.
 
తన యాక్టింగ్ స్కిల్స్ తో అనుష్క అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. అనుష్క రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆమె మాత్రం ఏడాదికి, రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం ఆఫర్లు వస్తున్నా అనుష్క మాత్రం తెలుగు భాషకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అనుష్క కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
అనుష్క నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఆమె మనస్సులో భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియాల్సి ఉంది. అనుష్క కెరీర్ ను అరుంధతి మార్చేసిందనే చెప్పాలి. అనుష్క సరైన ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా ముందుకెళ్తే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఆమెకు మరీ కష్టమేమీ కాదని చెప్పవచ్చు. చాలామంది సీనియర్ హీరోలకు అనుష్క బెస్ట్ ఆప్షన్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో అనుష్క ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సౌందర్య: బాక్సాఫీస్ కే పూనకాలు తెప్పించిన "అమ్మోరు"..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>