MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-came-forward-to-help-the-victims-of-the-wayanad-tragedye81c3986-bd51-488c-8d9b-2d24cc46d7b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-came-forward-to-help-the-victims-of-the-wayanad-tragedye81c3986-bd51-488c-8d9b-2d24cc46d7b0-415x250-IndiaHerald.jpgరెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా సలార్‌ సినిమాతో హిట్‌ కొట్టి.. ఊపుమీద ఉన్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ వన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సలార్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. salaar{#}Prabhas;prashanth neel;cinema theater;media;KGF;Prasanth Neel;Hindi;television;Cinemaరికార్డు సృష్టించిన ప్రభాస్ “సలార్”..అందరికీ చుక్కలు కనిపించాల్సిందే !రికార్డు సృష్టించిన ప్రభాస్ “సలార్”..అందరికీ చుక్కలు కనిపించాల్సిందే !salaar{#}Prabhas;prashanth neel;cinema theater;media;KGF;Prasanth Neel;Hindi;television;CinemaFri, 18 Oct 2024 07:04:00 GMTరెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తాజాగా సలార్‌ సినిమాతో హిట్‌ కొట్టి.. ఊపుమీద ఉన్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ వన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సలార్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


గత సంవత్సరం చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రభాస్‌ నటించిన సలార్ పార్ట్ వన్. అయితే.. థియేటర్ లో రిలీజ్‌ అయిన తర్వాత సూపర్ హిట్ దక్కించుకుంది. కానీ పార్ట్‌ 2 పైన ఎక్కడా కూడా ప్రకటన రాలేదు. దీంతో సలార్ పార్ట్ 2 షూటింగ్ ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆందోళన చెందుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. సలార్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ లీక్ అందరికీ షాకింగ్ గా మారింది.


సలార్ 2 అత్యంత కీలకంగా ఉండే టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ లోని కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా సలార్ పార్ట్ 1 సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ వర్షన్ ఉత్తరాదిన టీవీలో ప్రీమియర్ కాగా, అక్కడ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుని ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఇక ఈ సినిమా టీవీలలో ఏకంగా 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి 2024 లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 3 సినిమాల జాబితాలో నిలవడం ప్రత్యేక విశేషం.


ఇదే విషయం తెలుపుతూ సదరు టీవీ సంస్థ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కాగా, సలార్ పార్ట్ వన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ "శౌర్యంగ పర్వం" సినిమా గురించి ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక సలార్ 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరి సలార్‌ 2 ఎలా ఉంటుందో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒక్క సినిమాతో లేడీ అమితాబ్ గా మారిన విజయశాంతి.. గుర్తింపుతో పాటు అవార్డ్స్ కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>