MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jyotikaea785744-cd06-4894-b424-17950be576c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jyotikaea785744-cd06-4894-b424-17950be576c4-415x250-IndiaHerald.jpgసినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఎప్పటికి ప్రేక్షకుల మదిలో నిల్చిపోతాయి. కొందరు మాస్ చిత్రాలను ఆదరిస్తే కొందరు క్లాస్ మరికొందరు హార్రర్ చిత్రాలను అలాగే కామెడీ చిత్రాలను అందరిస్తుంటారు. అలాంటి కోవకే చెందిన హార్రర్, కామెడీ,డ్రామా చిత్రానికి చెందినదే 'చంద్రముఖి'సినిమా...ఆ పేరు వింటే మొదట గుర్తొచ్చేది 'లక..లక..లక' అనే డైలాగ్. ఆ మూవీ సౌత్ అడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయే సినిమా అని అనడంలో ఆశ్చర్యం లేదు.ఈ సినిమాలోని సాంగ్సjyotika{#}jyothika;Rajani kanth;Chandramukhi;raghava lawrence;Director;Comedy;Mass;Success;Audience;Cinemaలక...లక..అంటూ 'చంద్రముఖి' పాత్రకే జీవం పోసిన జ్యోతిక..!లక...లక..అంటూ 'చంద్రముఖి' పాత్రకే జీవం పోసిన జ్యోతిక..!jyotika{#}jyothika;Rajani kanth;Chandramukhi;raghava lawrence;Director;Comedy;Mass;Success;Audience;CinemaFri, 18 Oct 2024 09:51:00 GMT* కళ్ళతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన 'చంద్రముఖి'.!

* 'చంద్రముఖి' పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన జ్యోతిక.!

* 2005 లో భారీ విజయాన్ని అందుకున్న మూవీ.!

(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఎప్పటికి ప్రేక్షకుల మదిలో నిల్చిపోతాయి. కొందరు మాస్ చిత్రాలను ఆదరిస్తే కొందరు క్లాస్ మరికొందరు హార్రర్ చిత్రాలను అలాగే కామెడీ చిత్రాలను అందరిస్తుంటారు. అలాంటి కోవకే చెందిన హార్రర్, కామెడీ,డ్రామా చిత్రానికి చెందినదే 'చంద్రముఖి'సినిమా...ఆ పేరు వింటే మొదట గుర్తొచ్చేది 'లక..లక..లక' అనే డైలాగ్. ఆ మూవీ సౌత్ అడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళ హృదయాల్లో నిలిచిపోయే సినిమా అని అనడంలో ఆశ్చర్యం లేదు.ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2005లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా.. నయనతార, జ్యోతిక, ప్రభు, నాజర్, వడివేలు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే చాలు జనాలు టీవీలకే అతుక్కుపోతారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఇందులో రజినీకాంత్, వడివేలు మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ గురించి చెప్పక్కర్లేదు.అలాగే జ్యోతిక గంగ పాత్ర చేస్తూనే 'చంద్రముఖి'పాత్రలో లీనమవ్వడం అనేది చూడటానికి ఆ సీన్ భయంకరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ సీన్ చూసి కొంతమంది భయపడుతూ ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమాతోనే జ్యోతిక అంటే చంద్రముఖి గుర్తొచ్చేలా ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

అయితే 2005లో విడుదల ఐనా ఈ సినిమా సంచలనం సృష్టించడంతో సినిమా దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ సినిమా డైరక్టర్ పి. వాసు దర్శకత్వంలోనే రాఘవ లారెన్స్ హీరోగా సీక్వెల్ 'చంద్రముఖి 2' విడుదల చేశారు.అయితే చంద్రముఖి సినిమాని ఇష్టపడిన జనరేషన్ వాళ్లకు నాస్టాల్జిక్ ఫీల్ తెప్పించడానికే ఈ సినిమా డిజైన్ చేసినట్టుగా ఉంది.కానీ ఈ సినిమా రిజల్ట్ అనేది చంద్రముఖి దరి దాపుల్లో కూడా ఈ ఏ విధంగానూ వెళ్ళలేక పోయింది. కథంతా ముక్కలు ముక్కలుగా అతికించినట్టుగా ఉంది.కామెడీ చాలా రొటీన్‌గా ఉండడం క్యారెక్టర్ల పరిచయమే సరిగా కాకపోవడం వల్ల మొదటి నుంచీ కూడా ఎమోషనల్‌గా ఎటువంటి కనెక్షన్ ఏర్పడదు.ఏదేమైనా చంద్రముఖి లాంటి సినిమా మరల రావడం అంటే భారీగా ప్రేక్షకులను అక్కట్టుకెనేలా కధలో దమ్ము, డైరెక్టర్ పనితనం ఉండాల్సిందే. జ్యోతిక మాత్రం ఆ సినిమా ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకి చూపించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సౌందర్య: బాక్సాఫీస్ కే పూనకాలు తెప్పించిన "అమ్మోరు"..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>