Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith63a2690e-10b2-4b2a-9836-af432c4517e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith63a2690e-10b2-4b2a-9836-af432c4517e9-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియన్ క్రికెట్లో మాత్రమే కాదు వరల్డ్ క్రికెట్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇండియన్ క్రికెట్లో డబుల్ సెంచరీల ధీరుడిగా సిక్సర్ల వీరుడుగా అభిమానులు అందరూ కూడా రోహిత్ శర్మని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు తన బ్యాటింగ్ తోనే అలరించిన రోహిత్ శర్మ.. భారత కెrohith{#}World Cup;Rohit Sharma;New Zealand;Mumbai;Success;Indianహిట్ మ్యాన్ ఇప్పుడు ఫిట్ మ్యాన్.. కండలు తిరిగిన దేహం ఫోటో వైరల్?హిట్ మ్యాన్ ఇప్పుడు ఫిట్ మ్యాన్.. కండలు తిరిగిన దేహం ఫోటో వైరల్?rohith{#}World Cup;Rohit Sharma;New Zealand;Mumbai;Success;IndianThu, 17 Oct 2024 11:30:00 GMTటీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియన్ క్రికెట్లో మాత్రమే కాదు వరల్డ్ క్రికెట్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ పేరు మొదటి వరుసలోనే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇండియన్ క్రికెట్లో డబుల్ సెంచరీల ధీరుడిగా సిక్సర్ల వీరుడుగా అభిమానులు అందరూ కూడా రోహిత్ శర్మని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు తన బ్యాటింగ్ తోనే అలరించిన రోహిత్ శర్మ.. భారత కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు.


 ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన సత్తా ఏంటో చూపించిన రోహిత్ శర్మ.. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా కూడా భారత జట్టుకు ఒక టి20 వరల్డ్ కప్ అందించి అదరగొట్టేసాడు. కాగా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ టెస్ట్ వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ స్టార్ ప్లేయర్ అయినప్పటికీ అతని ఫిట్నెస్ పై ఎప్పుడు విమర్శలు వస్తూ ఉండేవి. అటు క్రికెటర్లకు ఉండాల్సిన ఫిట్నెస్ రోహిత్ శర్మకు లేదని.. ఏకంగా పొట్టతో కనిపిస్తూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు హిట్ మ్యాన్ కాస్త ఫిట్ మ్యాన్ గా మారిపోయాడు.


 ఒకప్పుడు ఏకంగా పొట్టతో అన్ ఫిట్ గా కనిపించిన రోహిత్ శర్మ.. ఇక ఇప్పుడు కండలు తిరిగిన దేహంతో లుక్ మార్చేశాడు. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ముంగిట రోహిత్ శర్మ.. ఇటీవల ఎన్నడు లేనంత ఫిట్ గా కనిపిస్తున్నాడు. బెంగళూరు గ్రౌండ్ లో ప్రాక్టీస్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకుముందుతో పోల్చి చూస్తే సన్నగా మారడమే కాదు కండలు తిరిగిన దేహంతో హిట్ మ్యాన్ కనిపిస్తున్నాడు. దీంతో ఇది చూసి ఫ్యాన్స్ అందరు కూడా మురిసిపోతున్నారు. ఇప్పుడు హిట్ మ్యాన్ హిట్.. ఫిట్ మ్యాన్ అయిపోయాడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్నో రీమిక్ లు చేసిన పవన్ దానిని రిజెక్ట్ చేశాడు.. చివరికి అది ఇండస్ట్రీ హిట్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>