Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sajjalae24375e6-c332-4cc9-8f5e-5964adc85336-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sajjalae24375e6-c332-4cc9-8f5e-5964adc85336-415x250-IndiaHerald.jpg వైయస్సార్సీపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఆంధ్ర ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన దుందుడుకుతనంతో సజ్జల రామకృష్ణారెడ్డి వైసిపి మంత్రులలో ముఖ్యుడిగా పేరుగాంచారు. ఈ క్రమంలోనే సజ్జల వైయస్సార్సీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరయ్యాడు. అయితే గడిచిన ఐదేళ్లలో వైయస్సార్సీపి ఆంధ్రాలో అధికారం చేపట్టింది కాబట్టి, సజ్జల పాడిందే పాటగా మారింది. ఈ క్రమంలో గతంలో టిడిపి కార్యాలయం పైన దాడి చేసిన నేపథ్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటుsajjala{#}Mangalagiri;YCP;TDP;Police Station;media;policeసజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు?సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు?sajjala{#}Mangalagiri;YCP;TDP;Police Station;media;policeThu, 17 Oct 2024 18:23:00 GMTవైసిపి మంత్రులలో ముఖ్యుడిగా పేరుగాంచారు. ఈ క్రమంలోనే సజ్జల వైయస్సార్సీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరయ్యాడు. అయితే గడిచిన ఐదేళ్లలో వైయస్సార్సీపి ఆంధ్రాలో అధికారం చేపట్టింది కాబట్టి, సజ్జల పాడిందే పాటగా మారింది. ఈ క్రమంలో గతంలో టిడిపి కార్యాలయం పైన దాడి చేసిన నేపథ్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతోనే సజ్జల తాజాగా విచారణకు హాజరు అయ్యారు.

మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు ఓ గంట సమయం పాటు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సజ్జల సంబంధం లేని సమాధానాలను చెప్పినట్టు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే దానికంటే ముందు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద హైడ్రామా క్రియేట్ అయినట్టు సమాచారం.

విషయం ఏమిటంటే, పోలీసు విచారణ జరిగిన చోటికి పొన్నవోలు తనని కూడా అనుమతించాలని కోరగా పోలీసులు దానికి నిరాకరించడం జరిగినది. ఈ సందర్భంలో పొన్నవోలు పోలీసులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాంతో దెబ్బతిన్న ఈ మంత్రులకి బుద్ధి రాలేదంటూ సామాన్య జనాలు కామెంట్లు చేస్తున్నారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోకి బయట వ్యక్తులు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం.

మరోవైపు, అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం వైసీపీ పార్టీకి చెందిన నాయకులే ధ్యేయంగా దాడులు, అక్రమ కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని సజ్జల ఓ మీడియా ముఖంగా వాపోయారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి తప్పుడు వాంగ్ములం సృష్టించి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి మరీ అవమానించి విచారిస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన రోజున బద్వేలులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉన్నానని, దాడికేసులో తన ప్రమేయం లేదని ఈ సందర్భంగా సజ్జల మీడియాతో తన గోడుని వెళ్లబుచ్చారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిధి ఆగర్వాల్ కు టార్చర్‌...ఒకేరోజు పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>